Homeహైదరాబాద్‌TRS | తెలంగాణ రక్షణ సేన సిక్కు మైనార్టీ విభాగం రాష్ట్ర కమిటీ నియామకం

TRS | తెలంగాణ రక్షణ సేన సిక్కు మైనార్టీ విభాగం రాష్ట్ర కమిటీ నియామకం

  • తెలంగాణ రాజకీయ చరిత్రలోనే మొదటిసారిగా సిక్కు విభాగానికి ప్రత్యేక కమిటీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మొదటిసారిగా సిక్కు మైనార్టీ విభాగానికి తెలంగాణ రక్షణ సేన(TRS ) ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. సిక్కు మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్. జస్బీర్ సింగ్ సంధు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎస్. హర్ ప్రీత్ సింగ్ ను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత నియమించారు. బుధవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులకు పార్టీ చీఫ్ కవిత నియామక పత్రాలు అందజేశారు.

రాజకీయ పార్టీల మైనార్టీ విభాగంలో ముస్లింలు, క్రిస్టియన్లతో పాటు సిక్కులు, ఇతర మైనార్టీలకు వివిధ పదవుల్లో అవకాశం ఇస్తారు. తెలంగాణ రక్షణ సేన మైనార్టీల్లోని ముస్లింలు, క్రిస్టియన్లకు వేర్వేరు కమిటీలు ప్రకటించగా.. ఇప్పుడు సిక్కు మైనార్టీల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. మైనార్టీల్లోని ఒక్కో సెక్షన్ సమస్యలు ఒక్కోలా ఉన్నాయి కాబట్టి వారందరికీ న్యాయం చేసేందుకే వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేశామని కవిత ప్రకటించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News