- సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…
మఠంపల్లి: మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వారి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోందని షీ టీమ్స్ పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నరసింహ ఆదేశాల మేరకు మఠంపల్లి మండల పరిధిలోని ఆర్క్సైన్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగార్థులకు మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై బుధవారం అవగాహన(Women Safety Awareness) కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ‘పోలీస్ అక్క’ కార్యక్రమం లక్ష్యాలు, షీ టీమ్స్ సేవలు, మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై ఫిర్యాదు చేసే విధానాలను వివరించారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతాల వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్ ద్వారా పోలీసుల సహాయం పొందాలని తెలిపారు.
అలాగే గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పిస్తూ, మహిళలు, యువతులు ఎలాంటి వేధింపులకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని, తమ భద్రత పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళల రక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్స్,భరోసా సిబ్బంది,కంపెనీ ప్రతినిధులు,ఉద్యోగులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
