Homeవరంగల్‌Venkatapuram Police | గుడుంబా తయారీ స్థావరాలపై వెంకటాపురం పోలీసుల ఉక్కుపాదం...

Venkatapuram Police | గుడుంబా తయారీ స్థావరాలపై వెంకటాపురం పోలీసుల ఉక్కుపాదం…

  • 21,800 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం, 102 లీటర్ల గుడుంబా స్వాధీనం…

వెంకటాపురం(నూగూరు): ములుగు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఏటూరునాగారం ఏ.ఎస్.పి పర్యవేక్షణలో వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ అటవీ ప్రాంతాల్లో అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్న స్థావరాలపై వెంకటాపురం పోలీసులు(Venkatapuram Police) బుధవారం ప్రత్యేక దాడులు నిర్వహించారు.

ఈరోజు నిర్వహించిన దాడుల్లో ఆలుబాక గ్రామపంచాయతీ పరిధిలోని ముత్తారం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నిల్వ ఉంచిన 25 డ్రమ్ముల్లో సుమారు 5,000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. బోదాపురం గ్రామపంచాయతీ పరిధిలోని సీతారాంపురం గ్రామ శివారులో 52 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన సుమారు 10,800 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 40 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

బోదాపురం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నిల్వ ఉంచిన 28 డ్రమ్ముల్లో సుమారు 6,000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 32 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నిర్వహించిన దాడుల్లో మొత్తం 105 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 21,800 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 102 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీలో పాల్గొన్న 8 మందిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు.

గత వారం రోజులుగా వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ అటవీ ప్రాంతాల్లో అక్రమ గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసులు విస్తృతంగా వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం నిర్వహించిన దాడులతో కలిపి ఇప్పటివరకు మొత్తం 35,900 లీటర్ల బెల్లం పానకాన్ని (జాగరీ వాష్) ధ్వంసం చేసి, 182 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన మొత్తం 22 మందిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

ఈ దాడుల్లో వెంకటాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ముత్యం రమేష్, వెంకటాపురం ఎస్‌ఐలు కె. తిరుపతిరావు, తిరుపతిరెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఆలుబాక సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ మద్యం తయారీ, నిల్వ, విక్రయాలు మరియు రవాణాకు పాల్పడే వారిపై నిరంతర నిఘా కొనసాగిస్తూ, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటాపురం పోలీసులు హెచ్చరించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News