HomeతెలంగాణKalvakuntla Kavitha | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అభ్యర్థులను గెలిపించండి

Kalvakuntla Kavitha | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అభ్యర్థులను గెలిపించండి

  • కాంగ్రెస్ పార్టీ ఫ్యూజ్ ఎగిరిపోయింది.. కొత్త తరాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత రైతన్నల మీద ఉన్నది
  • అధికార పార్టీకి, మొద్దు నిద్రలో ఉన్న విపక్షాలకు బుద్ధి చెప్పేందుకు ఈ ఎన్నికలు మంచి అవకాశం
  • గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా ఓటరుగా ఎన్ రోల్ చేసుకోవాలి
  • డబ్బులు తీసుకొని గ్రాడ్యుయేట్లు ఓట్లు వేస్తారన్న అపవాదును తొలగించాలి
  • తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)
  • టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు వీర తిలకం దిద్ది ప్రచారం ప్రారంభించిన కవిత

హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, ఆకాశ్ కొల్లూరితో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఫ్యూజ్ ఎగిరిపోయిందని.. పొలం కాడ ఫ్యూజ్ ఎగిరిపోతే రైతులు కొత్త ఫ్యూజ్ వేసినట్టు కొత్త తమ పార్టీ అభ్యర్థులకు రైతన్నలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఎన్నో హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు, నిద్రావస్థలో ఉన్న ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పేందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను విద్యావంతులు అవకాశంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్లంతా కచ్చితంగా ఓటరుగా ఎన్ రోల్ చేసుకొని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆకాశ్ కొల్లూరి, నల్గొండ- ఖమ్మం- వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ ను గెలిపించాలని కోరారు.

- Advertisement -
Kalvakuntla Kavitha Graduate MLC Election Campaign2

తెలంగాణ రక్షణ సేన మహిళా నాయకులు ఈరోజు తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు వీర తిలకం దిద్ది ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థులు చదువుకున్న యువకులని, ఒకరు ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ కాగా మరొకరు కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఉద్యమకారులని చెప్పారు. వారికి పొలిటికల్ గా ఫైనాన్షియల్ గా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదని.. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం మాత్రం ఉందన్నారు.

సామాజిక చైతన్యం కోసం ఎమ్మెల్సీ ఎన్నికల యుద్ధరంగంలోకి దిగుతున్నామని, ఆడబిడ్డలు, అన్నాదమ్ములు అందరూ తమ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక న్యాయంలో భాగంగా తాము ఇద్దరు బీసీలకే అవకాశం కల్పించామన్నారు. ఆకాశ్ కొల్లూరి కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన వారని.. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా కుమ్మరి సామాజిక వర్గానికి అవకాశం కల్పించలేదని, తాము ఆ కులం నుంచి అభ్యర్థిని పోటీకి దించామన్నారు.

డబ్బులు తీసుకుంటారనే అపవాదు తొలగించాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు కూడా డబ్బులు తీసుకుని ఓటు వేస్తారన్న ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు. రెండు వందల కోట్లు ఖర్చు పెట్టయినా సరే తమ అభ్యర్థులను గెలిపించుకుంటామని ముఖ్యమంత్రి చెబుతున్నాడని ధ్వజమెత్తారు. గ్రాడ్యుయేట్లు డబ్బులు తీసుకుంటారనే అపవాదు తొలగించుకోవాల్సిన అవసరముందన్నారు. గ్రాడ్యుయేట్లే డబ్బులు తీసుకోని ఓటు వేస్తే వ్యవస్థలో అవినీతి మరింత పెరుగుతుందన్నారు. తన మాటలు కఠినంగా ఉన్న సరే గ్రాడ్యుయేట్లు తమపై ఉన్న అపవాదును తొలగించుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 80 లక్షల మంది ఏదో ఒక డిగ్రీ ఉన్న వాళ్లేనని, వారంతా కూడా ఆలోచించి ఓటు వేయాలన్నారు. శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులుంటే అందులో గ్రాడ్యుయేట్ల ద్వారా ఎన్నికయ్యేది ముగ్గురు మాత్రమేనని చెప్పారు. ఆ ముగ్గురిని మన కోసం పనిచేసే వాళ్లను ఎన్నుకోవాల్సిన అవసరముందన్నారు. శాసన మండలిలో ప్రస్తుతం ప్రతిపక్షం లేని పరిస్థితి నెలకొందని.. బీఆర్ఎస్ సభ్యులు సగానికి పైగా కాంగ్రెస్ లో చేరిపోయారని గుర్తు చేశారు. బీజేపీ సభ్యులు కాంగ్రెస్ తో లోపాయికారి ఒప్పందంలో ఉన్నారని తెలిపారు. మండలిలో ప్రతిపక్షం అవసరముందని.. ప్రజల కోసం గొంతెత్తే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతిపక్షంగా గ్రాడ్యుయేట్ల తరపున పోరాటం చేస్తామన్నారు

Kalvakuntla Kavitha Graduate MLC Election Campaign01

మా అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడుతాం

రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా తెలంగాణలోని మూడో వంతు ప్రాంతంలో ఎన్నికల వాతావారణం ఉందని చెప్పారు. దాదాపు 75 నియోజకవర్గాల్లో ఎన్నికలు ఉంటాయని తెలిపారు. మా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేస్తామన్నారు. ఇవ్వాళ్టి నుంచి తాము యుద్ధరంగంలోకి దిగుతున్నామన్నారు. తమ యుద్ధం ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం, నదీ జలాల సాధన కోసం, ప్రభుత్వం ఎగొట్టిన హామీల అమలు కోసం ఉంటుందన్నారు. రాష్ట్రంలో తామే ప్రతిపక్షంగా మారి ప్రతి సమస్యపై పోరాటం చేయటం…(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News