- కేరళం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో ఘటన..
- ప్రోటోకాల్ పాటించకుండా స్టేజ్ మీదే కూర్చున్న రాహుల్, ప్రియాంక..
కేరళ ముఖ్యమంత్రి సతీశన్ ప్రమాణ స్వీకారంలో లోక్ భవన్ విధించిన నిబంధనల్ని పాటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. వేదికపై కేవలం గవర్నర్, కొత్త సీఎం వీడీ సతీశన్, ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు మాత్రమే కూర్చోవాలని లోక్ భవన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని సమాచారం. మిగిలిన నేతలంతా కింద ప్రేక్షకుల్లోనే కూర్చోవాలని పేర్కొన్నట్లు లోక్‌భవన్ వర్గాలు తెలిపాయి. కానీ ఈ ప్రొటోకాల్‌ను ఎవరూ పాటించలేదు. సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేరుగా వేదికపైకి వచ్చి కూర్చున్నారు.
వీరితో పాటు ప్రతిపక్ష నేత పినరయి విజయన్, సీపీఐ బినోయ్ విశ్వం, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్‌కు కూడా స్టేజ్‌పైనే సీట్లు కేటాయించారు. దీంతో లోక్ భవన్ ఆదేశాలు పూర్తిగా పక్కనబెట్టినట్లయింది. ఈ కఠినమైన ప్రొటోకాల్స్ వెనుక రాజకీయ కుట్ర ఉందని కాంగ్రెస్ నాయకత్వం ఆరోపించింది. రాహుల్ గాంధీ, ఖర్గేలను స్టేజ్‌పైకి రానివ్వకుండా చేయడానికే ఈ నిబంధనలు పెట్టారని మండిపడింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధాని, హోంమంత్రులు ఇలాగే వేదికలను పంచుకుంటారని కాంగ్రెస్ గుర్తుచేసింది. లోక్ భవన్ వైఖరి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని విమర్శించింది.
