Monday, June 8, 2026
Homeఅంతర్జాతీయంImran Khan | ఇమ్రాన్ ఖాన్ పై అమెరికా కుట్ర..

Imran Khan | ఇమ్రాన్ ఖాన్ పై అమెరికా కుట్ర..

  • విడుదలైన రహస్య దౌత్య పత్రం..
  • పూర్తి సారాంశాన్ని బయటపెట్టిన డ్రాప్ సైట్ పత్రిక..

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పదవి నుంచి దించేయడం వెనుక అమెరికా హస్తం ఉందంటూ ఆరోపిస్తున్న ఓ రహస్య దౌత్య పత్రం లీకైంది. అమెరికాకు చెందిన ‘డ్రాప్ సైట్’ అనే పరిశోధక వార్తా సంస్థ ఈ పత్రాల పూర్తి సారాంశాన్ని బయటపెట్టింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో కూలిపోవడానికి సరిగ్గా నెల ముందు.. అంటే 2022 మార్చిలో అమెరికా అధికారి డోనాల్డ్ లూ, అప్పటి అమెరికాలోని పాక్ రాయబారి అసద్ మజీద్ ఖాన్ మధ్య జరిగిన సంభాషణలు ఈ పత్రంలో ఉన్నాయి.

ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో పాకిస్థాన్‌ తటస్థంగా ఉండటాన్ని అమెరికా తీవ్రంగా తప్పుబట్టినట్లు ఈ పత్రాల ద్వారా తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనను ఆయన సొంత నిర్ణయంగానే అమెరికా చూసిందని డోనాల్డ్ లూ పేర్కొన్నారు. ‘‘ఒకవేళ ప్రధానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గితే.. వాషింగ్టన్ అంతా మర్చిపోతుంది. లేదంటే పాకిస్థాన్‌కు ముందు ముందు రోజులు చాలా కష్టంగా ఉంటాయి’’ అని అమెరికా అధికారి హెచ్చరించినట్లు ఆ పత్రాల్లో ఉంది. అంతేగాక ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉంటే పాక్‌ను అమెరికా, యూరప్‌ పూర్తిగా దూరం పెడతాయని కూడా ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News