కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామానికి చెందిన తాటికొండ కొమురయ్య (55) తన భార్య నరసవ్వ తో తన టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్ పై కరీంనగర్ నుండి నగునూరుకు వెళుచుండగా ఎదురుగా చొప్పదండి వైపు నుండి లారీ డ్రైవరు అయిన చింతల రాజు లారీని అతివేగముగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి టీవీఎస్ ఎక్సెల్ ను ఢీ కొట్టడంతో కొమురయ్య నరసవ్వలు క్రింద పడిపోయి బలమైన గాయములు తగలగా 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాటికొండ కొమురయ్య మరణించినట్లు రూరల్ ఇన్స్పెక్టర్ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు మృతుని అన్న కొడుకు తాటికొండ మల్లేష్ ఇచ్చిన దరఖాస్తు మేరకు కొమురయ్య మరణానికి కారణమైన లారీ డ్రైవర్ మల్లేష్ పై కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన లారీని సీజ్ చేసి లారీ ఫిట్నెస్ తనిఖీ కొరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు అప్పగించినట్లు తెలిపారు
