ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్
ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిరసన
తెలంగాణలో పెండింగ్(Pending)లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్(Reimbursement), స్కాలర్‌షిప్‌ల బకాయిల (Scholarship Arrears) విడుదల విషయంలో ప్రభుత్వం (Government) నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు (Leaders of Student Unions) ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల విడుదలపై ఉపముఖ్యమంత్రి (Dy CM) హామీకి కూడా గ్యారంటీ (Guarantee) లేకపోవడం విద్యా రంగం పై ప్రభుత్వ ప్రాధాన్యత లేమిని తెలియజేస్తోందని విమర్శించారు. నవంబర్ 3 నుంచి నిరవధిక సమ్మె నోటీస్ ఇచ్చిన యాజమాన్య సంఘాలతో చర్చించకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదలలో జాప్యం వల్ల బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిల విడుదల కోసం ఐక్య విద్యార్థి సంఘాలు దశల వారీగా పోరాటాలు నిర్వహిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు మల్లెబోయిన అంజి యాదవ్, పూదరి హరీష్ గౌడ్, నక్క శ్రీశైలం యాదవ్, ఎం.శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎల్ మూర్తి, ఆర్యన్ శంకర్, గద్దల అంజిబాబు, కొమ్ము శేఖర్, వలిగొండ శ్రీనివాస్, నాగరాజ్ యాదవ్, బూడిద ప్రవీణ్, వేదాంత మౌర్య, యాదగిరి, రమేష్, వెంకట్, చంద్రకాంత్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
