- పెరిగిన దిగుమతులు..
- నివేదిక విడుదల చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..
వాణిజ్యలోటు మళ్లీ కలవరపెడుతున్నది. ఒకవైపు ఎగుమతులు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నప్పటికీ అదే సమయంలో దిగుమతులు కూడా భారీగా పుంజుకుంటున్నాయి. గత నెలకుగాను ఎగుమతులు 12.78 శాతం ఎగబాకి 43.56 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఇదే సమయంలో దిగుమతులు 10 శాతం అందుకొని ఆరు నెలల గరిష్ఠ స్థాయి 71.94 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
దీంతో వాణిజ్యలోటు(ఎగుమతులు – దిగుమతుల మధ్య వ్యత్యా సం) మూడు నెలల గరిష్ఠ స్థాయి 28.38 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వాణిజ్యలోటు 27.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ సందర్భంగా వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ మాట్లాడుతూ..అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి నమోదవడం విశేషమన్నారు. గడిచిన ఐదు నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి వృద్ధి అని ఆయన పేర్కొన్నారు.
