Saturday, May 16, 2026
Homeకెరీర్ న్యూస్BC Gurukulam | దరఖాస్తు గడువు ఈనెల 20 వరకు..

BC Gurukulam | దరఖాస్తు గడువు ఈనెల 20 వరకు..

  • బీసీ గురుకులాల్లో ప్రవేశాలు..
  • ప్రభుత్వ బడుల్లో లైబ్రరీల ఆధునీకరణ..

బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని ఇంటర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును 20 వరకు పొడిగించారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్హులైన విద్యార్థులు https://mjptbcwreis.telangana.gov.in, https://mjptbcadmissions.org/MJP-Inter వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

1,138 ప్రభుత్వ బడుల్లో లైబ్రరీల ఆధునీకరణ :

- Advertisement -

రాష్ట్రంలోని మరో 1,138 సర్కార్‌ బడుల్లో విద్యాశాఖ గ్రంథాలయాలను అభివృద్ధి చేయనున్నది. విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు వీటి ఏర్పాటు కోసం ప్రతి పాఠశాలకూ రూ.15వేల చొప్పున నిధులు కేటాయిస్తారు. ఆ నిధులతో గదుల మరమ్మతులు, పెయింటింగ్స్‌, కుర్చీలు, బల్లలు, పుస్తకాల ర్యాక్‌లు, అల్మారాలు, ఫ్యాన్లు అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేయవచ్చని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News