- పాల్గొన్న జిల్లా బీజేపీ నాయకులు
- సంప్రదాయాల పరిరక్షణతోనే సమాజ అభివృద్ధి
- ప్రకృతి ఆరాధన, కుటుంబ శ్రేయస్సు కోసం భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఉత్సవం
ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని సైదుని తండలో లంబాడీ సోదరుల అత్యంత పవిత్రమైన సంప్రదాయ పండుగ అయిన తీజ్ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు రమేష్ నాయక్, జీవన్ నాయక్ గార్ల ప్రత్యేక ఆహ్వానం మేరకు మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారు, మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొని లంబాడీ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ, “తీజ్ పండుగ లంబాడీ సమాజం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ప్రకృతిని ఆరాధిస్తూ, కుటుంబ శ్రేయస్సు, పంటల సమృద్ధి, సమాజ శాంతి కోసం మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవడం ఎంతో విశిష్టమైన సంప్రదాయం.
మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత. లంబాడీ సమాజం తమ ఆచారాలను, సంస్కృతిని కాపాడుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ గిరిజనుల అభ్యున్నతి, వారి సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్లంపేట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ రజిత దేవేందర్ రెడ్డి ,కౌన్సిలర్లు అర్చన శ్రీనివాస్ ముదిరాజ్, మహేశ్వరి రాజేష్, శారదా రాజు నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు జగన్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, మేడిపల్లి డివిజన్ అధ్యక్షులు జమ్మల ప్రభాకర్ రెడ్డి,తండ పెద్దలు, మహిళలు, యువకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
