- మేడ్చల్‌లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు
- కార్యక్రమంలో పాల్గొన్న :-కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అంకితభావంతో పోరాడిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మేడ్చల్ పట్టణంలోని బాలాజీ నగర్ కేఎల్ఆర్ కమాన్ వద్ద జయశంకర్ సార్ విగ్రహ ప్రతిష్ఠ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించి, ప్రజల్లో ఆత్మగౌరవం, స్వాభిమానాన్ని పెంపొందించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం వేసి గ్రామం నుంచి నగరం వరకు ప్రతి తెలంగాణవాసిలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా చివరి శ్వాస వరకు అవిశ్రాంతంగా శ్రమించిన జయశంకర్ సేవలు చిరస్మరణీయమని తెలిపారు.
ఆయన కలలుగన్న సమానత్వ తెలంగాణ నిర్మాణం, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే ఆయనకు నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ సార్ విగ్రహ ప్రతిష్ఠ కమిటీ సభ్యులు చీదు వీరభద్రారెడ్డి, ప్రవీణ్, సత్యపాల్ రెడ్డి, భాస్కర్, రాజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, 297 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నడికొప్పు నాగరాజు (చాపరాజు) ముదిరాజ్, 298 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రేగు రాజు కురుమ, దుర్గం శివశంకర్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు చీర్ల రమేష్ కురుమ, జాకట దేవరాజ్, కౌడే మహేష్ కురుమ, నారెడ్డి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోమారం బాల్ రెడ్డి, కనకాల శివకుమార్ (బిపిటిరాజు),
మహమ్మద్ అయూబ్ ఖాన్ (యూసుఫ్), రామన్నగారి రాఘవేందర్ గౌడ్, నడికొప్పు రంజిత్ ముదిరాజ్, వేముల శ్రీనివాస్ రెడ్డి, తొంట యాదయ్య, మెట్టు వెంకట్ రాంరెడ్డి, మహమ్మద్ ముక్తార్, మేకల రాజశేఖర్ రెడ్డి (బబ్లూ), కాలేరు శ్రీకాంత్ వంజరి, మహమ్మద్ ఆరీఫ్, ఉదండపురం సత్యనారాయణ, రామన్నగారి సంతోష్ గౌడ్, తొంట సుధాకర్, అనంత్ రావు ముదిరాజ్, సత్తి రెడ్డి, గణేష్, కటిక వినయ్, ఘనపురం మల్లేష్, మేడ్చల్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లవంగు రాకేష్ వంజరి, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు గుండ శ్రీధర్ కురుమ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దండు శ్రీకాంత్ (చింటు), ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
