సోఫీనగర్ కాలనీలో బీజేపీ బూత్ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మణ్, అంబేద్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని, సమానత్వం, న్యాయం కోసం ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలిపారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు అంబేద్కర్ చూపిన దారిలో నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చిన్నయ్య, ముఖిమ్, నర్సింగరావు, సలీం, సాయిబాబా నారాయణ, సాయినాథ్, పొన్నం రాహుల్ గౌడ్, కరణ్, సుధాకర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా శేఖర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు సంతోష్, సన్నీ, సాల్మన్ రాజ్ హాజరయ్యారు. హిందూ వాహిని నాయకులు కళ్యాణ్, నరేష్, జగన్ కూడా పాల్గొన్నారు.
అనంతరం కాలనీలో అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ విందు చేశారు. ఈ వేడుకలు కాలనీలో ఐక్యతను ప్రతిబింబిస్తూ విజయవంతంగా ముగిశాయి.
