Homeనల్లగొండLand Dispute | భూ వివాదం కేసులో నలుగురి బైండోవర్

Land Dispute | భూ వివాదం కేసులో నలుగురి బైండోవర్

మఠంపల్లి: భూ వివాదాల(Land Dispute) విషయంలో గ్రామాల్లో అలజడి రేపి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మఠంపల్లి ఎస్సై బి ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని గుర్రంపోడు తండాలో భూ వివాదం(Land Dispute) కారణంగా రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతున్నట్లు సమాచారం అందిందని తెలిపారు.

హుజూర్‌నగర్ సీఐ గజ్జె చరమంద రాజు ఆదేశాల మేరకు ఇరువర్గాల వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ క్రమంలో గొడవకు పాల్పడిన కేతావత్ మోహన్,కేతావత్ చందు,రమావత్ నాగు,కేతావత్ హతిరామ్ అనే నలుగురిని మండల తహసీల్దార్ హిమ బిందు సమక్షంలో ఒక్కొక్కరికి రూ.5 లక్షల సొంత పూచీకత్తుతో ఏడాది పాటు బైండోవర్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి ఏడాది కాలంలో తిరిగి వివాదాలకు పాల్పడితే ఒక్కొక్కరు రూ.5 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని లేని ఎడల జైలు శిక్ష తప్పదని ఎస్సై స్పష్టం చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News