- రాజకీయ విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దుShankarpalli Congress Leaders
- సబితమ్మపై ఎమ్మెల్యే యాదయ్యకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదుShankarpalli Congress Leaders
- ఇంద్రారెడ్డి కుటుంబం అంటే మాకు ఎప్పటికీ గౌరవాభిమానాలే
- విమర్శలకు మాటలతో కాదు..అభివృద్ధి పనులతోనే సమాధానం చెబుతాం
- ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాకే ప్రజల్లోకి వెళ్తాం: కాంగ్రెస్ పార్టీ నాయకులు
రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత విమర్శలకు దిగుతూ ప్రజల్లో అనవసరమైన విభేదాలు, అపోహలు సృష్టించడం సరికాదని శంకర్పల్లి కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వ్యక్తిత్వాన్ని, ఆయన చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలే గుర్తిస్తున్నారని స్పష్టం చేశారు.చేవెళ్లలో జరిగిన ఒక చిన్న విషయాన్ని శంకర్పల్లిలో రాజకీయ వివాదంగా చిత్రీకరించి, వ్యక్తిగత విమర్శలకు వేదికగా మార్చడం చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఎమ్మెల్యే కాలే యాదయ్యకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్ల ఎలాంటి వ్యక్తిగత వ్యతిరేకత లేదని, ఇంద్రారెడ్డి కుటుంబం అంటే తమకు ఎప్పటికీ గౌరవాభిమానాలు ఉంటాయని నాయకులు పేర్కొన్నారు. సబితమ్మకు ఎమ్మెల్యే యాదయ్య వ్యక్తిత్వం, రాజకీయ ప్రస్థానం సుపరిచితమేనని, అలాంటప్పుడు రాజకీయ విభేదాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం తగదన్నారు.పెద్దలను గౌరవించడం, అందరినీ కలుపుకొని ముందుకు సాగడం యాదయ్య వ్యక్తిత్వంలో భాగమని పేర్కొన్నారు.Shankarpalli Congress Leaders
అభివృద్ధే మా ప్రాధాన్యత.. సంక్షేమమే మా లక్ష్యం!Shankarpalli Congress Leaders
గత మూడేళ్లుగా నియోజకవర్గంలోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కళ్లముందే ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. గ్రామీణ రహదారులు, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ,ఇందిరమ్మ చీరలు,ఇందిరమ్మ ఇళ్లు,బీమా పథకాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అండగా నిలుస్తున్నాయని వివరించారు. గతంలో పెండింగ్లో ఉన్న ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికుల పెన్షన్ల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రతి గ్రామంలో అర్హులైన పేదలకు పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైనా వాస్తవ పరిస్థితులను గ్రామాల్లో పరిశీలించిన తర్వాతే మాట్లాడాలని సూచించారు.పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని,పేదల కన్నీళ్లు తుడవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
పెండింగ్ పనులను త్వరలోనే పనులు ప్రారంభిస్తాం
నియోజకవర్గంలో ఇంకా పెండింగ్లో ఉన్న రహదారి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తవుతోందని, త్వరలోనే పనులు ప్రారంభించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామని నాయకులు వెల్లడించారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేర్చేందుకు ఎమ్మెల్యే కాలే యాదయ్య కృషి చేస్తున్నారని తెలిపారు.
మాటల యుద్ధం కాదు..అభివృద్ధి పనులతోనే సమాధానం చెబుతాంShankarpalli Congress Leaders
మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రజల మద్దతుతో గెలిచిన కాలే యాదయ్యపై విమర్శలు చేసే ముందు విమర్శకులు తమ రాజకీయ నేపథ్యాన్ని, ప్రజలకు చేసిన సేవలను ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులకు పదవులు కేటాయించడం అధికారంలో ఉన్న పార్టీ విధానపరమైన నిర్ణయమని, వాటిపై అనవసర ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. పదవులపై ఆసక్తి ఉన్నవారు వ్యక్తిగత విమర్శలు చేయడం కంటే పార్టీలో చేరి ప్రజాసేవకు ముందుకు రావాలని హితవు పలికారు. తాము వ్యక్తిగత దూషణలకు,రాజకీయ కక్షసాధింపు ధోరణికి దూరంగా ఉంటామని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే గర్వంగా ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. మా పని మాకు దైవం.. ప్రతి విమర్శకు అభివృద్ధి పనులతోనే సమాధానం చెబుతాం ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే మా బాధ్యత అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు గోపాల్ రెడ్డి,శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్, శంకర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మడపతి చంద్రమౌళి, సొసైటీ వైస్ చైర్మన్ పార్సి బాలకృష్ణ, గోపులారం మాజీ సర్పంచ్ పొడువు శ్రీనివాస్, కౌన్సిలర్ గణేష్, డైరెక్టర్లు ప్రశాంత్ కుమార్, సామయ్య, మున్సిపల్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
