Homeఆదాబ్ ప్రత్యేకంThondapalli Villas | తొండుపల్లి విల్లాల లీల..

Thondapalli Villas | తొండుపల్లి విల్లాల లీల..

తొండుపల్లిలో 84 విల్లాల అసెస్‌మెంట్లపై అనుమానాలు

  • మొత్తం ఆస్తి విస్తీర్ణం 49,610 చదరపు గజాలు..
  • 2002 పాత రికార్డులతో కొత్త విల్లాలకు లింకేంటి..?
  • ఇంటి నంబర్ల కేటాయింపునకు ప్రాతిపదిక ఏమిటి..?
  • అసెస్‌మెంట్లకు ఆధారమైన పత్రాలు చట్టబద్ధమైనవేనా?
  • మున్సిపల్ అధికారుల తీరుపై వ్యక్తమవుతున్న సందేహాలు..

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామంలో 84 విల్లాలకు(Thondapalli Villas) సంబంధించిన ఇంటి నంబర్లు, ఆస్తి పన్ను అసెస్‌మెంట్ల వ్యవ హారం స్థానికంగా కలకలం రేపుతోంది. దశాబ్దాల క్రితం నాటి గ్రామ పంచాయతీ రికార్డులకు, నేటి అత్యాధునిక లేఅవుట్ అభి వృద్ధికి అసలు పొంతన కుదరకపోవడంపై సర్వత్రా తీవ్ర అను మానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 84 విల్లాల ప్రాజెక్ట్ పరిధిలోని మొత్తం ఆస్తి విస్తీర్ణం 49,610 చదరపు గజాలుగా ఉంది. ఇంత భారీ స్థాయి లేఅవుట్‌కు ఇంటి నంబర్లు కేటాయించిన విధానం, ఆస్తి పన్ను అసెస్‌మెంట్లకు ప్రాతిపదికగా తీసుకున్న పత్రాలు, వాటి చట్టబద్ధతపై ఇప్పుడు అత్యంత కీలకమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

- Advertisement -

పాత రికార్డులు.. కొత్త అభివృద్ధి.. : తొండుపల్లి గ్రామ పంచా యతీకి సంబంధించి 2002 నాటి పాత అనుమతుల రికార్డులు ఉన్నట్లు పత్రాల్లో స్పష్టంగా ప్రస్తావించారు. మరోవైపు, ఈ లేఅవుట్ నిర్మాణం, అభివృద్ధి మాత్రం పూర్తిగా ప్రస్తుత కాలానికి సంబంధిం చినది. దీంతో పాతికేళ్ల కిందటి పాత రికార్డులకు, నేటి విల్లాల అసెస్‌మెంట్లకు ముడిపెట్టడం వెనుక ఆంతర్యమేమిటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. నాటి పాత రికార్డుల ఆధారంగా ప్రస్తుత ఆస్తులకు నిబంధనలకు విరుద్ధంగా నంబర్లు కట్ట బెట్టారా? లేక ప్రతి విల్లాకు సంబంధించిన ప్రత్యేక దస్తావేజులను విడివిడిగా పరిశీలించి అసెస్‌మెంట్లు చేశారా? అనే విషయాలు మున్సిపల్ రికా ర్డుల లోతుల్లోకి వెళ్తేనే బయటపడతాయి.

ఇంటి నంబర్ కేటాయింపులో చట్టపరమైన నిబంధనలు కీలకం : సాధారణంగా మున్సి పల్ పరిపాలనలో ఇంటి నంబర్ కేటా యింపు, ఆస్తి పన్ను అసెస్‌మెంట్ అనేవి సాధారణ ప్రక్రియే. అయితే, కేవలం మున్సిపల్ రికార్డుల్లో ఇంటి నంబర్ లేదా పన్ను అసెస్‌మెంట్ ఉన్నంత మాత్రాన ఆ ఆస్తిపై పూర్తిస్థాయి చట్టబద్ధమైన యాజ మాన్య హక్కులు వచ్చినట్లు కాదు. అలాగే, అసెస్‌మెంట్ జరిగినంత మాత్రాన ఆ భవన నిర్మాణం లేదా లేఅవుట్‌కు ప్రభుత్వ విభాగాల నుంచి రావాల్సిన అన్ని చట్టబద్ధమైన అనుమతులు ఉన్నట్లు భావించడానికి వీలేదు. ఈ నేపథ్యంలో తొండుపల్లిలోని 84 విల్లాలకు(Thondapalli Villas) ఏ ప్రాతిపదికన అసెస్‌మెంట్లు జరిగాయి, క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన జరిగిందా, సంబంధిత రికార్డులను బాధ్యులైన అధి కారులు ధ్రువీకరించారా అనే కోణంలో సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది.

మున్సిపల్ వ్యవస్థలో పారదర్శకత ఎక్కడ? : ఇంటి నంబర్లు, ఆస్తి పన్ను అసెస్‌మెంట్లు జారీ చేసే తంతులో దస్తావేజుల పరిశీలన, రికార్డుల ధ్రువీకరణ అత్యంత ప్రాధాన్యమైనవి. ఈ ప్రక్రియలో ఎక్కడైనా చిన్న లోపం జరిగినా, అది భవిష్యత్తులో అమాయక ఆస్తి యజమానులు, కొనుగోలుదారులు మరియు మున్సిపల్ పరి పాలన యంత్రాంగానికి పెద్ద చిక్కులను తెచ్చిపెడుతుంది. తొండుపల్లి వ్యవహారంలోనూ 84 విల్లాలకు సంబంధించిన అసెస్‌మెంట్ రికార్డులు, వాటికి ఆధారమైన పత్రాలు, నంబర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా వెల్లడి కావాల్సి ఉంది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పాత రికా ర్డులు, ప్రస్తుత ఆస్తి అసెస్‌మెంట్ల మధ్య సమన్వయాన్ని సరిగ్గా పరిశీలించకపోతే ఇలాంటి అక్రమాలు ఇతర ప్రాంతాలకూ పాకే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఆస్తికి సంబంధించిన రికార్డులను పక్కాగా నిర్వ హించడం, నిబంధనలను తూచా తప్పకుండా పాటించి అసెస్‌మెంట్లు చేయడం, తప్పులుంటే వెంటనే సరిది ద్దడం అధికారుల కనీస బాధ్యత. తొండుపల్లిలోని 84 విల్లాల ఉదంతం మున్సిపల్ అసెస్‌మెంట్ విధానంలో ఉన్న లొసుగులను ఎత్తి చూపుతున్న నేపథ్యంలో, ఇందులో వాస్తవాలు నిగ్గు తేల్చడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే!(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News