అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని మఠంపల్లి మండల పరిధిలోని యాతవాకిళ్ల గ్రామంలో శుక్రవారం ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కుక్కల కరుణ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ బి. మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల వారికి ఈ పథకం వర్తిస్తుందని బీమా చేయించుకున్న వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.Indiramma Family Life Insurance
బీమా పొందిన వ్యక్తికి అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని వివరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుక్కల కరుణ నాగరాజు, ఉప సర్పంచ్ బొమ్మకంటి బాల నాగయ్య, పంచాయతీ కార్యదర్శి ఎం. నరేష్,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుక్కల నాగరాజు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వంటిపులి శ్రీనివాస్,వార్డు సభ్యుడు కుక్కల సైదులు,ఫీల్డ్ అసిస్టెంట్ బిక్షం తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
