Homeఆదిలాబాద్Child Marriage Prevention | బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత

Child Marriage Prevention | బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత

  • సూపర్వైజర్ జ్యోతిChild Marriage Prevention

బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని అంగన్వాడి సూపర్వైజర్ జ్యోతి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ బాల్య, బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని రాంనగర్ సెక్టార్ పరిధిలోని ఎన్‌టిఆర్ నగర్–3 అంగన్‌వాడీ కేంద్రంలో సి.డి.పి.ఓ. తో కలిసి బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్ జ్యోతి మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, మానసిక వికాసం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.Child Marriage Prevention

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటిని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
సి.డి.పి.ఓ. మాట్లాడుతూ బాలికలకు నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, భద్రతతో పాటు సమాన హక్కులు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఈ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించి, ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఐ.సి.పి.ఎస్. లు సత్యయ్య, ప్రేమ్, అంగన్‌వాడీ టీచర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News