- మైనర్ విద్యార్థితో వెళ్ళిపోయిన ఘటన..Teacher POCSO Case
- ఉత్తరప్రదేశ్ లో సంచలనం..
పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలే మైనర్ విద్యార్థితో వెళ్లిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించింది. విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఇద్దరినీ లక్నోలోని ఓ హోటల్లో గుర్తించారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించగా.. ఉపాధ్యాయురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు.. తనకంటే వయసులో చాలా చిన్నవాడైన 15 ఏళ్ల విద్యార్థితో కలిసి వెళ్లిపోయినట్లు వచ్చిన వార్త కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు, విద్యార్థి అదృశ్యం, లక్నోలో జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.Teacher POCSO Case
బస్తీ జిల్లా కప్తాన్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోధ్వా గ్రామంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో రూపాలి అనే 26 ఏళ్ల మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె సుమారు ఏడాది కాలంగా అక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇదే పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు పాఠశాల నిర్వాహకుడి కుమారుడు. ఈ క్రమంలో ఉపాధ్యాయురాలు, విద్యార్థి మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది.Teacher POCSO Case
కొంతకాలంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. నవంబర్ 21న ఉపాధ్యాయురాలు రూపాలి బాలుడిని తనతో తీసుకెళ్లినట్లు విద్యార్థి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఉదయం సుమారు 7 గంటల సమయంలో బాలుడు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.మొదట కుటుంబ సభ్యులు తమకు తెలిసిన ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికారు. అయినప్పటికీ బాలుడి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో బాలుడితో కలిసి చదువుతున్న మరో విద్యార్థి ద్వారా ఉపాధ్యాయురాలు రూపాలి అతడిని తనతో తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందినట్లు కథనాలు వెల్లడించాయి..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
