Homeరంగారెడ్డిChild Marriage Awareness | బాల్య వివాహాలకు చెక్ పెట్టాలి!

Child Marriage Awareness | బాల్య వివాహాలకు చెక్ పెట్టాలి!

  • ప్రతి బాలికకు చదువుకునే హక్కు కల్పించాలిChild Marriage Awareness
  • బాలికల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి
  • శంకర్‌పల్లిలో విద్యార్థుల అవగాహన ర్యాలీ.. బాల్య వివాహాల నిర్మూలనకు ఎంవీఎఫ్ సంస్థ పిలుపు

బాల్య వివాహాలను అరికట్టి బాలికలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో శంకర్‌పల్లి పట్టణంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలికల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఎంవీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం చేపట్టారు. శంకర్‌పల్లి జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాల్య వివాహాలు వద్దు.. బాలల భవిష్యత్తుకు అడ్డుకట్ట వేయొద్దు,ప్రతి బాలికకు చదువుకునే హక్కు కల్పించాలి అంటూ ప్రజల్లో చైతన్యం నింపారు.Child Marriage Awareness

చిన్న వయసులోనే వివాహ బంధంలోకి నెట్టడం వల్ల బాలికల విద్య,ఆరోగ్యం,స్వేచ్ఛ, భవిష్యత్తు ఎలా ప్రభావితమవుతాయో వివరించారు. అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ వసతి గృహంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి విద్యార్థినులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలికల హక్కులు, విద్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఆర్గనైజర్ మంగ పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంవీఎఫ్ సంస్థ మండల ఇన్‌చార్జి ఎస్. నాగమణి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు బాలికల జీవితాలను చిన్నాభిన్నం చేయడమే కాకుండా వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. బాల్యం నుంచే విద్యకు దూరం చేయడం వారి ఎదుగుదలకు ఆటంకంగా మారుతుందని తెలిపారు. బాలికలపై జరుగుతున్న శారీరక, మానసిక, లైంగిక హింసకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు.Child Marriage Awareness

- Advertisement -
Child Marriage Awareness rally was organized by the Mamidipudi Venkatarangaiya Foundation in Shankarpalli to demand an end to child marriages.

హింస ఇక చాలు.. రండి మారండి.. కలిసి పోరాడుదాం, అనే నినాదంతో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బాలికలకు నాణ్యమైన విద్య,సమాన అవకాశాలు,స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించినప్పుడే వారు అన్ని రంగాల్లో రాణించగలరని అన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వాటిని అడ్డుకునేందుకు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

బాల్య వివాహాల నిర్మూలన కేవలం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యత మాత్రమే కాదని.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు,యువతతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు, ఎంవీఎఫ్ సంస్థ సభ్యులు, అమ్మ ఆదర్శ కమిటీ పాఠశాల చైర్మన్ సరళ లక్ష్మి, విద్యార్థులు పాల్గొని బాల్య వివాహాల నిర్మూలనకు తమ సంఘీభావం తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News