- ఆకాశంలో ఒక తార సినిమాపై కేటీఆర్ ప్రశంసలు..KTR Akashamlo Oka Tara
- హిట్ టాక్ తో దూసుకువెళ్తున్న మూవీ..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎంత బిజీ బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం ప్రజల్లో తిరుగుతూ, పార్టీ నాయకులను కలుస్తూ సభలు, సమావేశాల్లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతుంటారు. అయితే ఇంత బిజీ షెడ్యూల్ లోనూ అప్పుడప్పుడు కొన్ని సినిమాలను చూస్తున్నారు కేటీఆర్. అది కూడా కంటెంట్ బాగుంటేనే. ఆ మధ్యన న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ సినిమాను థియేటర్ కు వెళ్లి చూశారు కేటీఆర్. తాజాగా ఆయన మళ్లీ ఓ సినిమాను చూశారు. అంతేకాదు ఆ సినిమాపై రివ్యూ కూడా ఇచ్చారు. ఇంతకీ కేటీఆర్ మెచ్చిన ఆ సినిమా ఏదనుకుంటున్నారా? దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఆకాశంలో ఒక తార.KTR Akashamlo Oka Tara
పవన్ సాధినేని తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రుతి హాసన్ మరో కీలక పాత్రలో ఆకట్టుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో పాటు కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ఎస్.ఎస్. రాజమౌళి, ఎన్టీఆర్, సుమంత్, అడివి శేష్, అల్లరి నరేష్, శివ నిర్వాణ, నాని తదిర సినీ ప్రముఖులు ఆకాశంలో ఒక తార సినిమాను చూసి మెచ్చుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఆకాశంలో ఒక తార సినిమాను వీక్షించి ప్రశంసలు కురిపించారు. తాజాగా కేటీఆర్ ఈ సినిమాను వీక్షించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
