Wednesday, December 10, 2025
EPAPER
Homeమెదక్‌ED Strict Action | మహిపాల్ రెడ్డి సోదరుడికి ఈడీ షాక్

ED Strict Action | మహిపాల్ రెడ్డి సోదరుడికి ఈడీ షాక్

పటాన్‌చెరు ఎమ్మెల్యే (Patancheru MLA) గూడెం మహిపాల్‌రెడ్డి(Gudem Mahipal Reddy) సోదరుడు మధుసూదన్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(Enforcement Directorate) షాక్ ఇచ్చింది. అతనికి చెందిన సంతోష్‌ శాండ్‌ అండ్‌ గ్రానైట్‌ కంపెనీ (Santosh Sand and Granite Company) ఆస్తుల(Assets)ను అటాచ్‌ చేసింది. ఈ కంపెనీ రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపించింది. ప్రభుత్వానికి రూ.39 కోట్ల రాయల్టీ (Royalty) చెల్లించలేదని తెలుస్తోంది. అనుమతిలేని చోట్ల మైనింగ్‌(Mining), సబ్ కాంట్రాక్టుల అక్రమాలతోపాటు పరిమితికి మించి తవ్వకాలు చేపట్టినట్లు ఈడీ పేర్కొంది. భారీగా నగదు కొల్లగొట్టినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈడీ దాదాపు రూ.80 కోట్ల విలువైన కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News