Homeమెదక్‌Awareness | డ్రై డే ఫ్రై డే అంటే గిట్లుండాలి

Awareness | డ్రై డే ఫ్రై డే అంటే గిట్లుండాలి

  • పాలన పక్కకు పెట్టి పరిశుభ్రతపై దృష్టి
  • గ్రామస్తులచే ప్రశంశల వెల్లువ
  • ఆయన ఆ ఊరిసర్పంచ్ కాదు గ్రామ సేవకుడు

పాలన పక్కకు పెట్టి పరిశుభ్రతయే ధ్యేయంగా మలుచుకుని గ్రామాల్లో వ్యాధులను పారద్రోలడమే తన లక్ష్యం అని . గ్రామా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిత్యం గ్రామంలో ఉంటూ వారికి తోచిన సూచనలు ఇవ్వడమే కాకుండా కాకుండా వారితో పాటు పనులు నిమగ్నమైతున్నారు. తాజాగా డ్రై డే ఫ్రైడే సందర్భంగా శుక్రవారం రోజున జగదేవపూర్ మండలం బి జీ వెంకటాపూర్ గ్రామంలో చేపట్టారు. వారు గ్రామంలో వారి ప్రజలకు వర్షాకాలం సీజన్ మొదలు కావడంతో డెంగ్యూ ,మలేరియా వంటి సీజన్ వ్యాధుల పట్ల అవగాహన పై గ్రామస్తులకు విరుస్తున్న క్రమంలో మండల పీఎంఓ హాజరై వారు వివరిస్తూ గ్రామ సర్పంచ్ చెక్కల పరమేశ్వర్ తో కలసి గ్రామంలో తిరిగి ఇళ్లలో వెళ్లి నిలిచి ఉన్న నీటిని పరిశీలించి వాటిలో దాగి ఉన్న జీవులను పరిశీలించారు. అంతరం గ్రామస్తులకు పలు సూచనలు జారీ చేశారు.

పలు గ్రామాల్లో కనిపించని డ్రై డే ఫ్రై డే

- Advertisement -

జగదేవపూర్ మండలంలో పలు గ్రామాల్లో డ్రై డే ఫ్రై డే అధికారులు తూ.. తూ మంత్రంగా పాటిస్తున్నారు. ఎవరైనా అధికారి ప్రశ్నిస్తే మేము చేసాము అంటూ ఫోటోలు దిగి పోజులు ఇస్తున్నారే తప్ప వారు మాత్రం కార్యక్రమంలో పాల్గొనడం లేదనీ గ్రామాల్లో ఎక్కడ ఎవరిని అడిగినా ఇదే తంతు వినిపిస్తుంది.

Dry Day Friday Awareness Drive Jagadevpur

సపోర్ట్ చేయడం లేదు

ప్రతీ శుక్రవారం, రోజున చేయవలసిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమానికి కొన్ని గ్రామాల్లోని అధికారులు ప్రజా ప్రతినిధులకు సపోర్ట్ చేయడం లేదని కొందరు సర్పంచులు బాహాటంగానే చెబుతున్నారు. ప్రశ్నిస్తే మాకు మా పై అధికారులు వేరే పనులు అప్ప చెప్పారంటూ కార్యక్రమానికి పంగనామాలు పెడుతున్నారనీ వాపోతున్నారు.

ఫోటోలకు ఫోజులు

ఇక మరికొన్ని గ్రామాల్లో అసలే చేయడం లేదని చేసిన గ్రామాల్లో కార్యక్రమాన్ని హడావిడిగా చేపట్టి ఆపై ఫోటోలు పూజలు ఇచ్చి వాట్సప్,ఫేస్బుక్ , స్టేటస్ లో పెట్టుకొనే పనిలో బి జీ గా అంటున్నారే తప్ప గ్రామాల్లో ఉండే వారికి అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు.

అధికారులు ఉన్నారా.. లేరా

గ్రామాల్లో అధికారులు అసలు ఉన్నారా..? లేరా ..? అని పలు గ్రామాల ప్రజలకు సందేహం కలుగుతుందని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. కనీసం గ్రామాల్లో వీధి, వీథి తిరిగి ప్రజలకు కురుస్తున్న వర్షాల వల్ల తీసుకోవలసిన జాగ్రత్తలు వారికి వివరించపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి జగదేవపూర్ మండలంలో డ్రై డే కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు పలు సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News