Monday, June 8, 2026
Homeఆంధ్రప్రదేశ్Chandrababu | పరీక్షలంటే తెలియని వారు కూడా విమర్శిస్తున్నారు..

Chandrababu | పరీక్షలంటే తెలియని వారు కూడా విమర్శిస్తున్నారు..

  • తీవ్ర స్థాయిలో ఆగ్రహం వెలిబుచ్చిన చంద్రబాబు..
  • ఘనంగా మీ భూమి మీ హక్కు కార్యక్రమం..

పరీక్షలు అంటే ఏమిటో, రిజర్వేషన్లు అంటే ఏమిటో తెలియని వ్యక్తులు డీఎస్సీ నియామకాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం సిద్ధాంతంలో నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు.

గత పాలకులు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను దగా చేశారని, తాము అధికారంలోకి వచ్చాక దాదాపు 16 వేల టీచర్ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఏం చెప్పాలో తెలియక నేరాలు చేసి, ఎదుటివారిపై దుష్ప్రచారం చేయడమే ‘గొడ్డలి పార్టీ’ పనిగా పెట్టుకుందని విమర్శించారు. గొడ్డలి పట్టుకునే చేతులకు నాగలి పట్టే రైతులు గుర్తుకురారని, కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లకు వరికోతలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు.

- Advertisement -

భూ వివాదాలకు తావులేని గోదావరి జిల్లాల్లో గత పాలకులు చిచ్చుపెట్టి రికార్డులు తారుమారు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట ఓ నల్ల చట్టం తెచ్చి ప్రజల భూములను కాజేయాలని చూశారని, ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన రికార్డులను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం చేశారని అన్నారు. “మేం అధికారంలోకి రాగానే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసి భూ యాజమాన్య హక్కుల్ని కాపాడాం. భూమి మీది, కానీ ఫొటోలు వారివి ముద్రించుకున్నారు. పొలం సరిహద్దు రాళ్లపై కూడా వారి బొమ్మలు వేసుకున్నారు” అని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News