Homeఆంధ్రప్రదేశ్Chandrababu Naidu | అభివృద్ధిలో ఏపీ నెంబర్ వన్..

Chandrababu Naidu | అభివృద్ధిలో ఏపీ నెంబర్ వన్..

  • పునరుద్ఘాటించిన సీఎం చంద్రబాబు..
  • అధికారులకు దిశా నిర్ధేశం..

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటూ సానుకూల వృద్ధిరేటుతో దూసుకెళ్తోంది. గడిచిన రెండేళ్లుగా జాతీయ సగటును మించి ప్రగతి సాధిస్తున్న ఏపీ, 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. అయితే, ఈ సానుకూల వాతావరణంలోనూ ఎల్ నినో రూపంలో పొంచివున్న ముప్పును ముందుగానే పసిగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దానిని అధిగమించి రాష్ట్రాన్ని 15 శాతం వృద్ధిరేటు పథంలో నడిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రణాళికా విభాగం అధికారులు సమర్పించిన జూలై నెల ఆర్థిక నివేదికపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ప్రణాళికా విభాగం నివేదిక ప్రకారం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధి రేటు 2023-24లో 6.5 శాతం ఉండగా, 2025-26 నాటికి 9.9 శాతానికి పెరిగింది. ముఖ్యంగా వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. 2025-26 రెండో త్రైమాసికంలో వ్యవసాయ రంగం 13.5 శాతం, పారిశ్రామిక రంగం 10.6 శాతం, సేవా రంగం 9.9 శాతం చొప్పున వృద్ధి సాధించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలుగా నిలిచాయి. పశుసంవర్ధక శాఖలో మాంసం, గుడ్ల ఉత్పత్తి పెరగడంతో పాటు, ఐటీ, రవాణా, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకున్నాయి. టెక్నాలజీ వినియోగంతో జీఎస్టీ వసూళ్లు 21 శాతం పెరిగి రూ.13,282 కోట్లకు చేరగా, రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కూడా ఆశాజనకంగా ఉంది. రూ.2.88 లక్షల కోట్ల విలువైన మెగా ప్రాజెక్టులు, రూ.60 వేల కోట్ల ఎంఎస్‌ఎంఈ పెట్టుబడులు గ్రౌండింగ్‌లో మంచి వృద్ధిని కనబరిచాయి.

- Advertisement -

ఈ ఆర్థిక ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఎల్ నినో ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. “రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉంది. కృష్ణా నదిలో ప్రవాహాలు లేక శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండలేదు. గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించి ఆదుకున్నాం. భూగర్భ జలాలు కూడా తగ్గుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జీఎస్‌డీపీ పడిపోకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి” అని ఆయన సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News