Friday, January 16, 2026
EPAPER
Homeరాజకీయంబీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ గూటికి చేరిన కార్యకర్తలు

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ గూటికి చేరిన కార్యకర్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని కొరటికల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు చుంచు వీరస్వామి, చుంచు అంజయ్య మరియు చుంచు అనిత తమ సభ్యత్వానికి రాజీనామా చేసి, గురువారం ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వారికి ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి, తాజా మాజీ ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్, ఆ పార్టీ నాయకులు కట్టెకోల హన్మంతు, కందటి అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News