- సర్పంచ్ గొర్లపల్లి అశోక్.
- వెంకమ్మగూడలో సిసి రోడ్డు పనులు ప్రారంభం.
తమ గ్రామాన్ని అన్ని హాంగులతో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే తమ ముందున్న ప్రథమ లక్ష్యమని సర్పంచ్ గొర్లపల్లి అశోక్ పేర్కొన్నారు. నందిగామ మండల పరిధిలోని వెంకమ్మగూడ గ్రామంలో ఆదివారం సిసి రోడ్డు నిర్మాణం పనులను సర్పంచ్ గొర్లపల్లి అశోక్ ముఖ్య అతిథులుగా హాజరై, ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తమ గ్రామన్ని ఒక ప్రణాళిక బద్దంగా ఒక్కో సమస్యను శాశ్వత పరిష్కారం దిశగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.
తమ గ్రామాన్ని సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్ది,అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నూతన సిసి రోడ్డును డిఎంఎఫ్టి, గ్రామ పంచాయతీ నిధుల నుంచి సుమారు 20 లక్షల రూపాయల నిధులతో బోడ్రాయి నుంచి రచ్చబండ వరకు వేస్తున్నట్లు తెలిపారు.
గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో బిటి రోడ్లు, సిసి రోడ్లు, అండర్ డ్రైనేజీ వ్యవస్థ, ప్రభుత్వ భవనాల నిర్మాణాల కోసం నిధులను మంజూరు చేస్తూ సహాయ, సహకారాలు అందజేస్తున్న షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..
