Homeనిజామాబాద్‌Tadwai | ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడో…?

Tadwai | ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడో…?

  • ఏడాది గడుస్తున్న ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న మోడల్ హౌస్ నిర్మాణం…?

మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాలేదు. పనులు మొదలుపెట్టి ఏడాది కాలం గడుస్తున్నా ఇంకా ఇందిరామ్మ మోడల్ హౌస్ నిర్మాణ దశలోనే ఉంది. ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం ప్రజలందరికీ తెలిసే విధంగా మండలానికి ఒక మోడల్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. అందులో భాగంగా జిల్లాలో చాలా మండలాల్లో నిర్మాణాలు ఇప్పటికే పూర్తయినప్పటికీ తాడ్వాయిలో మాత్రం పనులు నత్త నడకన సాగుతున్నాయి.

అధికారుల పర్యవేక్షణలోపమో, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో, తెలియదు కానీ మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు నిర్మాణ పనుల్లో ఏలాంటి పురోగతి కనిపించడం లేదు. ఏడాదిన్నర గడుస్తున్న ఇంకా మాడల్ హౌస్ నిర్మాణం గోడలకే పరిమితమైందని, ఎప్పుడు నిర్మాణం పూర్తి చేస్తారో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి మోడల్ హౌస్ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని కోరుచున్నారు.

Tadwai Indiramma Model House construction delay01
- Advertisement -
RELATED ARTICLES

Latest News