- ప్రముఖులను ఆహ్వానించిన ఆదాబ్ ప్రతినిధులు..
పత్రికా ప్రపంచంలో ఒక ప్రత్యే కతను చాటు కుంటూ.. ప్రజలకు, ప్రభు త్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ.. 14 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా సాగించి, 15వ సంవత్సరంలోకి అడుగిడు తున్న ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక తమ 15వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపు కోనుంది.. ఈనెల 26నాడు రవీంద్రభారతి వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు పలువురు ప్రముఖులకు ఆహ్వానం పలికారు ఆదాబ్ ప్రతినిధులు.. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్. రాహుల్ దేవరాజ్ లను కలిసి ఆహ్వానపత్రిక అందిం చారు ఆదాబ్ ప్రతినిథులు.. ఆహ్వానం అందు కున్నవారు తప్పకుండా కార్యక్రమానికి హాజర వుతామని చెబుతూ ఆదాబ్ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు..


