ఆదిలాబాద్(Adilabad) జిల్లాకు ఈమధ్య కాలంలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో (National, State Level) ఏకంగా ఏడు అవార్డులు వచ్చాయి. ఈ పురస్కారాలను జిల్లా కలెక్టర్ (Collector) రాజర్షిషా (Rajarshi Shah) ప్రధాని మోదీ(PM Modi), గవర్నర్ (Governor) జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఉత్తమ ఎన్నికల నిర్వహణ అవార్డు. మార్చిలో స్కోచ్ గవర్నెన్స్ అవార్డు, ఏప్రిల్‌లో పీఎం ప్రజాస్వామ్య పరిపాలన ప్రతిభా పురస్కారం, ఆగస్టులో గవర్నర్ గోల్డ్ మెడల్(Gold Medal), సెప్టెంబర్‌లో జల్ సంచాయి జన భాగిదారి నేషనల్ అవార్డ్, అక్టోబర్‌లో నీతి ఆయోగ్ (Niti Aayog) నేషనల్ అవార్డులు, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ పురస్కారాలు లభించాయి.
