Tuesday, November 11, 2025
ePaper
Homeఆరోగ్యంAsthma | ఉబ్బసంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా?

Asthma | ఉబ్బసంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా?

ఉబ్బసంతో ఉక్కిరి బిక్కిరి అయ్యే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అసలు ఆ ఉబ్బసం చిన్నప్పటి (Childhood) నుంచి ఉందా? పెద్దయ్యాక (Elder) వచ్చిందా? అనే గుర్తించాలి. ఉబ్బసం అనేది ఎక్కువగా చిన్నతనంలోనే వస్తుంది, పెద్దయ్యాక రాదు అనుకుంటారు. కానీ.. అది కరెక్ట్ (Not Correct) కాదు. ఉబ్బసం ఒక్కోసారి పెద్దయ్యాక కూడా వస్తుంది. 20 ఏళ్లు దాటాక వచ్చే ఉబ్బసాన్ని పెద్ద ఉబ్బసంగా పేర్కొంటారు. దీనికి కూడా చిన్ననాటి ఉబ్బసం మాదిరి లక్షణాలే (Symptoms) ఉంటాయి. కాకపోతే పెద్దవారి సీరియస్‌గా ఉంటాయి. ట్రీట్మెంట్ల(Treatments)కూ లొంగకపోవచ్చు. వ్యాధి (Disease) లక్షణాలను పట్టించుకోకపోవటం వల్లే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఆయాసం, దగ్గు (Cough) వంటి వాటికి ఇతర రోగాలు కారణం కావొచ్చు అనుకుంటే పొరపాటు. దీని కారణంగా జబ్బును గుర్తించటం, చికిత్స పొందటం లేటవుతుంది. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల (Lungs) పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి.. ఆయాసం, దగ్గు, పిల్లికూతలు లాంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్‌(Doctor)ను కలవటం బెటర్.

RELATED ARTICLES
- Advertisment -

Latest News