- అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
- మ్యాట్ పిలేట్స్ మీకు ఉపయోగపడతాయి..
ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల చాలామందిలో భుజాలు ముందుకు వంగిపోవడం, వెన్నెముకపై ఒత్తిడి పెరగడం, కోర్ కండరాలు బలహీనపడటం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. దీని ఫలితంగా నడుము బిగుసుకుపోవడం, మెడ నొప్పి, శరీర భంగిమలో మార్పులు ఏర్పడుతాయి. ఈ సమస్యలను తగ్గించడంలో మ్యాట్ పిలేట్స్ ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కోర్, వెన్ను, శరీరాన్ని స్థిరంగా ఉంచే కండరాలను బలోపేతం చేసి వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు కండరాలను బలంగా చేసే మ్యాట్ పిలేట్స్ వ్యాయామాల గురించి నిపుణులు వివరిస్తున్నారు. పెల్విక్ కర్ల్ అనే పిలేట్స్ వ్యాయామం పొత్తికడుపు, వెన్ను కండరాలను బలపరచడంలో సహాయపడుతుంది. కోర్ స్థిరత్వాన్ని పెంచి వెన్నెముకకు మద్దతు ఇస్తుంది. ఈ వ్యాయామాన్ని నెమ్మదిగా శ్వాస నియంత్రణతో చేయడం వల్ల మరింత ప్రయోజనం లభిస్తుంది.
స్విమ్మింగ్ అనే పిలేట్స్ వ్యాయామాన్ని పొట్టపై పడుకుని చేతులు, కాళ్లను ప్రత్యామ్నాయంగా కదిలించడం ద్వారా చేస్తారు. ఇది వెన్ను కండరాలను బలపరచి శరీర భంగిమను మెరుగుపరుస్తుంది. అలాగే వెన్నెముకకు మెరుగైన మద్దతును అందిస్తుంది. స్పైన్ స్ట్రెచ్ ఫార్వర్డ్ వ్యాయామం వెన్నెముక సౌలభ్యాన్ని పెంచుతుంది. ఈ సమస్యలను నివారించేందుకు ప్రతి 30 నుంచి 60 నిమిషాలకు ఒకసారి లేచి కదలడం, కంప్యూటర్ స్క్రీన్‌ను కళ్ల స్థాయిలో ఉంచడం, సరైన ఎత్తులో కుర్చీ ఉపయోగించడం, తరచూ స్ట్రెచింగ్ చేయడం, కూర్చునే సమయంలో కోర్ కండరాలను చురుకుగా ఉంచడం వంటి అలవాట్లు ఉపయోగపడతాయి.
