Friday, June 12, 2026
HomeసినిమాMaa Inti Bangaaram | ‘మా ఇంటి బంగారం’ మూవీ సెన్సార్ పూర్తి

Maa Inti Bangaaram | ‘మా ఇంటి బంగారం’ మూవీ సెన్సార్ పూర్తి

ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 19న విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో సినిమా టీం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ పూర్తయింది.

‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు మేకర్స్‌ను అభినందించారు. ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఇక ఈ చిత్రం జూన్ 19న గ్రాండ్ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటికే సమంత ఈ సినిమా గురించి ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు. తాజాగా ఇన్ స్టాలో తన అభిమానులతో ముచ్చిటిస్తూ ఈ మూవీకి సంబంధించిన ఎన్నో విషయాల్ని తెలియజేశారు.

- Advertisement -

ప్రేక్షకులు పెట్టే డబ్బు, వెచ్చించే సమయం ఇలా అన్నింటికీ న్యాయం చేసేలా సినిమా ఉంటుందని టీం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీకి ఓం ప్రకాష్ కెమెరామెన్‌గా, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా పని చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఈ సినిమా జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ఈ చిత్రంలో శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజుష, దిగంత్, గుల్షన్ దేవయ్యలు ముఖ్య పాత్రలు పోషించారు.

తారాగణం:
సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: ట్రలాలా మూవింగ్ పిక్చర్స్
నిర్మాతలు: సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు
కథ & స్క్రీన్ ప్లే: రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్
డైరెక్టర్: నందిని రెడ్డి
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
సంగీతం: సంతోష్ నారాయణన్
యాక్షన్: లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదూర్
PRO: వంశీ కాకా

- Advertisement -
RELATED ARTICLES

Latest News