Homeఆదాబ్ ప్రత్యేకంAadab Effect | 'ఆదాబ్ హైదరాబాద్' కథనానికి స్పందన..

Aadab Effect | ‘ఆదాబ్ హైదరాబాద్’ కథనానికి స్పందన..

  • ఖజానాలో పైసలున్నా కార్మికులకు తప్పని తిప్పలు అనే కథనానికి స్పందించి, పెండింగ్ వేతనాలు విడుదల
  • పంచాయతీ కార్మికులకు చేరిన వేతనాలు!
  • హర్షం వ్యక్తం చేసిన పంచాయతీ కార్మికులు

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పంచాయతీ మల్టీపర్పస్ కార్మికుల ఆకలి కేకలపై ‘ఆదాబ్ హైదరాబాద’ పత్రికలో ప్రచురితమైన ప్రత్యేక కథనం అధికారుల్లో కదలిక తెచ్చింది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో అకౌంట్లలో నిధులున్నా, గత నాలుగు నెల లుగా జీతాలు రాక కార్మికులు పడుతున్న అవస్థలను కళ్లకు కడుతూ నిన్న ప్రచురించిన వార్తకు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. వార్త ప్రచురితమైన కొద్ది గంటల్లోనే జిల్లా ఉన్నతాధికారులు, ఆదేశాల మేరకు మండల అధికారులు స్పందించారు. టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ ఆలస్యం కారణంగా ఆగి పోయిన జీతాల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు.

ఖాతాల్లో నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ ఫైళ్ల కదలికలో నిర్లక్ష్యం వహించిన అధికారులను మందలించినట్లు తెలుస్తోంది. అనం తరం, కార్మికులకు రావాల్సిన 4 నెలల బకాయికి గాను 1 నెల వేతనాలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. గత కొన్ని నెలలుగా చేతిలో రూపాయి లేక, నిత్యావసర సరు కులు కొనలేక, అప్పులపాలువుతూ తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్న కార్మికుల ఇళ్లలో ఈరోజు హర్షాతిరేకాలు వ్యక్తమవుతు న్నాయి. జీతాలు రాక, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగలేక చచ్చి పోయాం. మా కష్టాన్ని గుర్తించి పత్రికలో వార్త రాయడంతోనే అధికారుల చేతులు కదిలాయి. మా అకౌంట్లలో డబ్బులు పడ్డాయి” అని ఒక పంచాయతీ కార్మికుడు ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -
Panchayat workers wages released after aAdab Hyderabad report intervention

కృతజ్ఞతలు తెలిపిన పంచాయతీ కార్మికులు.. అధికారుల ఉదాసీనతను ఎండగట్టి, నిరుపేద కార్మికుల పొట్ట నింపేందుకు అండగా నిలిచిన ‘ఆదాబ్ హైదరాబాద’ దినపత్రికకు కార్మిక సంఘాల నాయకులు గ్రామ పంచాయతీ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ఇలాంటి ఆలస్యాలు జరగకుండా ప్రతినెలా ఐదో తారీఖులోపు జీతాలు అందేలా శాశ్వతచర్యలు తీసుకోవా లని వారు కోరుతున్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో మీడి యా పాత్ర ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News