- 12 లక్షల రూపాయలు విలువగల బంగారం సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఓకే ఇంట్లో రెండుసార్లు దొంగతనం చేసిన దొంగను కరీంనగర్ రూరల్ పోలీసులు సిసిఎస్ పోలీసులు చాక చక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు వివరాల్లోకి వెళితే కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లి లోని రెవెన్యూ కాలనీలో గత ఫిబ్రవరి జూన్ నెలలలో ఒకే ఇంటిలో రెండుసార్లు దొంగతనం జరగగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో లో కేసు నమోదు కాగా కరీంనగర్ సిపి గౌష్ ఆలం ఆదేశాల మేరకు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ అట్టి దొంగతనంలను చేదించుటకై కరీంనగర్ రూరల్ సిఐ ఏ.నిరంజన్ రెడ్డి సిసిఎస్ సిఐ ప్రకాష్ గౌడ్ లకు అప్పగించగా కేసును ఛేదించారు.
తీగలగుట్టపల్లి లోని రెవెన్యూ కాలనీకి చెందిన మహమ్మద్ ముస్తాక్ అనునతడు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ డాష్ రమ్మీ అనే అప్లికేషన్ను తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని గత రెండు సంవత్సరాల నుండి ఆడుతూ అట్టి ఆటకు అలవాటు పడి లక్షల్లో నష్టపోయి అప్పులల్లో కూరుకుపోయి వాటిని తీర్చుటకు దొంగగా మారినాడు, వివరాల్లోకి వెళితే మహమ్మద్ ముస్తాక్ గత సంవత్సరంన్నర నుండి కోదాడ దగ్గరలోని మేళ్లచెరువు వద్ద బాయిలర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ డాష్ రమ్మీ ఆడుటకు అలవాటు పడి తన తల్లిదండ్రులకు తెలియకుండా తన స్నేహితులు తెలిసిన వారి వద్ద డబ్బులు అప్పుచేసి డాష్ రమ్మి అను ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో ఆడి పోగొట్టుకొని తిరిగి చెల్లించలేక దొంగగా మారాడు.
ఇందుకోసం ఇదే సంవత్సరం ఫిబ్రవరి జూన్ నెలలో తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి తీగల గుట్టపల్లి లోని ఒకే ఇంట్లో రెండుసార్లు కిటికీ యొక్క గ్రిల్ తొలగించి ఇంట్లోకి చొరబడి బంగారం నగదును దొంగతనం చేసినాడు జూబ్లీ నగర్ లోని దర్గా సమీపంలో గల ఒక ఇంట్లోకి చొరబడి టీవీని దొంగలించినాడు. దొంగలించిన బంగారాన్ని కరీంనగర్ లో ఎవరూ కొనక పోవడంతో కోదాడ వెళ్లి అక్కడ అమ్మడానికి ప్రయత్నించాడు అక్కడ కూడా ఎవరూ కొననందున తిరిగి తీగలు గుట్టపల్లి కి వచ్చి వరంగల్ లో గాని మంచిర్యాలలో గాని అమ్ముదామని నిర్ణయించుకొని తీగల గుట్టపల్లి లోని రైల్వే స్టేషన్ కు వచ్చి బయట నిలబడి ఉండగా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించుచుండగా కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఏ నిరంజన్ రెడ్డి సిబ్బంది పట్టుకొని అతని వద్ద దొంగలించబడిన సొమ్ము సుమారు 91 గ్రాముల బంగారం, 5 వేల రూపాయల నగదు ఒక సెల్ ఫోను పోలీసులు స్వాధీనపరచుకొన్నారు.
తదుపరి చర్య నిమిత్తం కోర్టులో హాజరు పరచి రిమాండ్ కు తరలించనైనదనీ రూరల్ ఇన్స్పెక్టర్ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు, ఇట్టి దొంగతనంలో కేసుల్లోని నేరస్తుడైన మహమ్మద్ ముస్తాక్ ను పట్టుకున్న కరీంనగర్ రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి సిసిఎస్ సిఐ ప్రకాష్ గౌడ్ ఎస్సై లక్ష్మారెడ్డి సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ హసనోద్దీన్ పిసి ఎన్.శేఖర్ పిసి ఎండి ఖలీకానిస్టేబుల్లు కానిస్టేబుల్లు పిసి సల్మాన్ లను సిపి గౌష్ ఆలం ఏసిపి విజయ్ కుమార్ లు అభినందించినారు సిబ్బందికి నగదు రివార్డును అందజేశారు
