Friday, November 14, 2025
ePaper
Homeఎన్‌.ఆర్‌.ఐAustralia | జూబ్లీహిల్స్‌లో ప్రచారానికి BRS ఆస్ట్రేలియా బృందం

Australia | జూబ్లీహిల్స్‌లో ప్రచారానికి BRS ఆస్ట్రేలియా బృందం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills ByElection)లో ప్రచారం కోసం బీఆర్ఎస్ ఆస్ట్రేలియా (BRS Australia) ప్రతినిధి బృందం వచ్చింది. వీరిలో ఉప్పు సాయిరామ్, వినయ్ సన్నీ గౌడ్ తదితర ముఖ్య నాయకులు ఉన్నారు. ఈ నేతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అభినందించారు. తెలంగాణ ఉద్యమ (Telangana Movement) సమయం నుంచి పార్టీ బలోపేతానికి పాటుపడుతున్నారని ప్రశంసించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సాయిరామ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంట సునీత (Maganti Suneetha) ఘన విజయం సాధిస్తారని చెప్పారు. సునీత గెలుపుతో తెలంగాణ ప్రజల గౌరవం మరింత పెరుగుతుందని వినయ్ సన్నీ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కేటీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News