Friday, November 14, 2025
ePaper
Homeబిజినెస్Amazon | సీఎం రేవంత్‌ను కలిసిన అమెజాన్ ప్రతినిధులు

Amazon | సీఎం రేవంత్‌ను కలిసిన అమెజాన్ ప్రతినిధులు

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ప్రతినిధి బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సమావేశంలో.. ప్రస్తుతం కొనసాగుతున్న డేటా సెంటర్ ప్రాజెక్టులు (Data center projects), తెలంగాణలో AWS విస్తరణ ప్రణాళికలపై చర్చలు జరిపింది. ఈ బృందంలో కెర్రీ పర్సన్, వైస్ ప్రెసిడెంట్(AWS గ్లోబల్ ఆపరేషన్స్ అండ్ డేటా సెంటర్ డెలివరీ); విక్రమ్ శ్రీధరన్, డైరెక్టర్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ పాలసీ, AWS); అనురాగ్ ఖిల్నాని, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ డెలివరీ) తదితర సీనియర్ అధికారులు ఉన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడులు(Investments), విస్తరణ కార్యక్రమాలకు ప్రభుత్వం పూర్తి సహకారం (Collaboration) అందిస్తుందని హామీ ఇచ్చారు.

YouTube player
RELATED ARTICLES
- Advertisment -

Latest News