Friday, November 14, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుMu*der | మందు తాగుతూ గొడవ.. వ్యక్తి హత్య..

Mu*der | మందు తాగుతూ గొడవ.. వ్యక్తి హత్య..

మర్డర్‌ కేసు నిందితుడికి రిమాండ్‌

బాలానగర్‌ ఏసీపీ పి.నరేష్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌: మర్డర్‌ కేసు నిందితుణ్ని పోలీసులు (Police) అదుపులోకి తీసుకొని రిమాండ్‌(Remand)కు తరలించారు. ఈ ఘటన సైబరాబాద్‌ కమిషనరేట్‌ (Cyberabad Commissionerate) మేడ్చల్‌ జోన్‌ (Medchel Zone) బాలానగర్‌ ఠాణా (Bala Nagar Police Station) పరిధిలో మంగళవారం జరిగింది. కేసు వివరాలను ఏసీపీ నరేష్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ టి.నర్సింహరాజు, ఎస్‌ఐ సరితారెడ్డితో కలిసి వెల్లడించారు. బాలానగర్‌ గుడేన్‌మెట్‌ వద్ద సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి శవ పంచనామా నిర్వహించారు. అనంతరం డెడ్‌బాడీ(Dead Body)ని పోస్టుమార్టం(Postmortem) నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. చనిపోయిన వ్యక్తిని పాతబస్తీ ఫలక్‌నుమా వట్టేపల్లికి చెందిన వంట మనిషి మహ్మద్‌ హుస్సేన్‌ గఫూర్(39)గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్‌కు చేరుకున్న మృతుడి అన్న మహ్మద్‌ రషీద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు సిద్దాపూరం అజయ్‌ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరపగా హత్యకు దారితీసిన కారణాలను తెలిపాడు. మహ్మద్‌ హుస్సేన్ గఫూర్‌, అతని స్నేహితులు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌ వద్ద మందు తాగుతూ (Drinking) గొడవకు దిగి కాలుతో తన్నారు. దీంతో కిందపడ్డ అజయ్ కోపంతో పండ్లు కోసే కత్తితో దాడి చేశాడు. దాడిలో మహ్మద్‌ హుస్సేన్ గఫూర్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు నిందితుడి నుంచి కత్తి స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

YouTube player
RELATED ARTICLES
- Advertisment -

Latest News