Homeరంగారెడ్డిBadi Bata | మెరుగైన విద్య అందడమే ధ్యేయం..

Badi Bata | మెరుగైన విద్య అందడమే ధ్యేయం..

  • ప్రతి విద్యార్ధికి మేలు జరగాలి…
  • ప్రత్యేక చర్యలు చేపట్టిన ప్రభుత్వం..
  • సర్పంచ్ విజయ శ్రీశైలం గౌడ్.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం అబ్దుల్లాపూర్ మెట్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో నిర్వహించిన “ఆచార్య జయశంకర్ బడి బాట” కార్యక్రమంలో బాగం గా గ్రామ సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ ముఖ్య అధితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.

Acharya Jayashankar Badi Bata Program Abdullahpurmet

అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి బడి బాట ర్యాలీ నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న పథకాలు, సదుపాయాల గురించి ప్రజలకు వివరించి, విద్యార్థులను తమ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్, ఉపాధ్యాయులు, నాయకులు, అమ్మ పాఠశాల ఛైర్మెన్ సంతోష, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News