- మంత్రులకు, ఎమ్మెల్సీకి ఆహ్వానపత్రిక అందించిన ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ..
- కార్యక్రమానికి హాజరుకావాలని కోరిన వైనం..
పత్రికా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుని.. ప్రజల తరఫున పోరాటం సాగిస్తూ.. మా అక్షరం అవినీతిపై అస్త్రం అంటూ అప్రతిహతంగా 14 ఏళ్ల సుదీర్ఘ అక్షర యజ్ఞం చేస్తూ విజయవంతమైన 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది ‘ఆదాబ్ హైదరాబాద’ తెలుగు దినపత్రిక.. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని తమ 15వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని సంకల్పించింది.. ఈ క్రమంలో ఈనెల 26 అనగా బుధవారం రోజు రవీంద్రభారతి వేదికగా వేడుకలను నిర్వహించుకుంటోంది.. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క) అదేవిధంగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ లకు ఆహ్వాన పత్రిక అందించారు ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ.. కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.. ఆహ్వానం అందుకున్న వారు తప్పనిసరిగా హాజరు అవుతామని తెలిపారు.. అలాగే ఆదాబ్ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో ఆదాబ్ ప్రతినిథులు కూడా పాల్గొన్నారు..


