అంబేద్కర్ పై హమారా ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రమేష్ మాదిగ అన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మంగళవారం మాట్లాడుతూ మత దుహంకారి ఆర్ఎస్ఎస్ భావజాలం నింపుకొని కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్న హమారా ప్రసాద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని కలిపిత నాయకుడు అంటూ పేర్కొనడం సరికాదు అన్నారు.
పుస్తకాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న హమారా ప్రసాద్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ దళితులకు స్వేచ్ఛ స్వాతంత్రం కరువైందన్నారు. డాక్టర్ భీమ్ రామ్ అంబేద్కర్ 1950లో భారత రాజ్యాంగాన్ని రాసిన తర్వాత భారతదేశంలో సబ్బండ వర్గాలకు సమాన హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయని వివరించారు.
ఇంతటి గొప్ప మహా మేధావిని పట్టుకొని కల్పిత నాయకుడు అంటూ ఆర్ఎస్ఎస్ భావజాలంతో విషం చిమ్ముతున్న హమారా ప్రసాద్ ని వెంటనే అరెస్టు చేయాలని డిపెండ్ చేశారు. లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాలతో నిరసనలు, ధర్నా(MRPS Protest) కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు గుగ్గిళ్ళ నరేంద్ర మాదిగ, సీనియర్ నాయకులు యాసం మహేష్ మాదిగ, సీనియర్ నాయకులు కోకిల మల్లికార్జున్ మాదిగ, వెంకటాపురం ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి చెన్నం గౌతం మాదిగ, ఎమ్మార్పీఎస్ కార్యదర్శి చెన్నం తిరుపతి మాదిగ, ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు వేల్పుల రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ కార్యదర్శి తిప్పనపల్లి వెంకటేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
