- ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ వైపు ఒక సంవత్సరం ప్రయాణం..
- భావితరాలకు పరిశుభ్రమైన భూమిని అందించడం…
- సమాజంలో శాశ్వత మార్పును తీసుకురావడం…
- క్యాన్సర్ వ్యాధికి శాశ్వతంగా చెక్ పెట్టడం..
- ఇవి కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు…
- మిగతా నాయకులు కూడా ఇదే బాటలో నడవాలి..
- ఇది ఈ భూమ్మీద నివసించే ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
హుస్నాబాద్ గడ్డపై ఒక హరిత విప్లవం ఆరంభమైంది. ప్లాస్టిక్ మహమ్మారి నుంచి పర్యావరణాన్ని కాపాడుకుంటూ, భావితరాలకు స్వచ్ఛమైన భూమిని కానుకగా అందించడమే ధ్యేయంగా ఒక అద్భుతమైన ప్రజా చైతన్య సేవా యజ్ఞం రూపుదిద్దుకుంది. పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి అనే మూడు ప్రధాన లక్ష్యాలతో రూపుదిద్దుకున్న వినూత్న కార్యక్రమమే ‘స్టీల్ బ్యాంక’. స్వర్గీయ పొన్నం సత్తయ్య అమూల్యమైన సేవా స్ఫూర్తితో, ఆయన జ్ఞాపకార్థం… రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాక(Ponnam Prabhakar)ర్ సొంత నిధులతో ఈ మహత్తర బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు.
గడిచిన ఏడాది కాలంగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ ‘ప్లాస్టిక్ రహిత హుస్నాబాద’ ప్రయాణం, కేవలం ఒక కార్యక్రమంగా మాత్రమే గాక ఒక ఉద్యమంగా మారింది. ప్లాస్టిక్ వినియోగంతో క్యాన్సర్ మహమ్మారి విజృభిస్తోంది.. ఈ వ్యాధికి పేద, గొప్ప అనే తారతమ్యం లేదు.. ఎవరినైనా కబళిస్తుంది.. ఈరోజు క్యాన్సర్ బారినపడి చికత్స కోసం ఆసుపత్రుల్లో కనిపిస్తున్న రోగులు దీనికి నిదర్శనం.. ఒక్క పొన్నం ప్రభాకర్ కాదు..
మిగతా ప్రజా ప్రతినిధులు ఆయన బాటలో నడిస్తే క్యాన్సర్ ను కట్టడి చేయడం సులభం అవుతుంది అన్నది యదార్ధం.. ప్లాస్టిక్ ను సమూలంగా పక్కన పడేసి, స్టీల్ వినియోగం లోకి తీసుకునివస్తే క్యాన్సర్ నుంచి బయటపడగలుగుతాం.. అంతే కాకుండా పర్యావరణ స్పృహ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని చాటిచెబుతూ పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) చేస్తున్న ఈ మహత్తర యజ్ఞం సమాజంలో శాశ్వతమైన మార్పుకు నాంది పలుగుతోంది.. ఈ వినూత్న ‘స్టీల్ బ్యాంక’ స్ఫూర్తిదాయక కథనం మీకోసం…

ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, గ్రామాల అభివృద్ధి అనే మూడు లక్ష్యాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన వినూత్న కార్యక్రమమే… ‘స్టీల్ బ్యాంక’.” “స్వర్గీయ శ్రీ పొన్నం సత్తయ్య గారి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ… ఆయన జ్ఞాపకార్థం… మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీ పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో, స్వంత నిధులతో ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.” తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా కోహెడలో ప్రారంభమైన ఈ కార్యక్రమం… నేడు ఒక విజయవంతమైన సామాజిక ఉద్యమంగా మారి ఏడాది పూర్తి చేసుకుంది. ప్లాస్టిక్‌ను నిషేధించమని చెప్పడం ఒక్కటే పరిష్కారం కాదు… దానికి ప్రత్యామ్నాయం ప్రజల చేతుల్లో పెట్టాలి… అనే ఆలోచనతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్టీల్ బ్యాంక్ అనే ఒక ఆలోచనకు అద్భుతక రూపమిచ్చారు.
ఒక్కసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్‌కు బదులుగా… పదేళ్లు, ఇరవై ఏళ్ళు ఉపయోగపడే స్టీల్ పాత్రలను ప్రతి గ్రామ మహిళా సంఘాలకు అందుబాటులో ఉండేలా… గ్రామ సంఘాల ద్వారా స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో గ్రామ సంఘాలను భాగస్వాములను చేస్తూ.. హుస్నాబాద్ మండలం – 21 వీవో లు .. కోహెడ – 38 వీవో లు.. అక్కన్నపేట – 36 వీవోలు.. చిగురుమామిడి – 37 VOలు.. సైదాపూర్ – 35 వీవో లు.. భీమదేవరపల్లి – 45 వీవో లు.. ఎల్కతుర్తి – 40 వీవో లు.. హుస్నాబాద్ మున్సిపాలిటీ – 20 ఏ.ఎల్.ఎఫ్.లు.. హన్మకొండ జిల్లా వేలేరు మండలంలోని కన్నారం, ఎర్రబెల్లి – 4 వీవో లు.. మొత్తం – 276 గ్రామ సంఘాలు
ఈ 276 గ్రామ సంఘాల పరిధిలో పనిచేస్తున్న 7,376 స్వయం సహాయక సంఘాలు, 80,633 మంది సంఘ సభ్యులకు ఉపయోగపడేలా… ఒక్కో స్టీల్ బ్యాంక్‌లో 13 రకాల స్టీల్ పాత్రలతో మొత్తం 276 స్టీల్ బ్యాంక్ సెట్లను పూర్తిగా ఉచితంగా అందించారు. ఈ మహత్తర కార్యక్రమం కోసం శ్రీ పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.2,54,06,318 (రూ.2.54 కోట్లకు పైగా) స్వంత నిధులు వెచ్చించడం… సమాజానికి తిరిగి ఇవ్వాలనే సేవా తపనకు నిదర్శనం. నేడు గ్రామాల్లో జరిగే పెళ్లిళ్లు… శుభకార్యాలు… అన్నదానాలు… గ్రామ సభలు… ఎన్నో కార్యక్రమాల్లో ప్లాస్టిక్‌కు బదులుగా స్టీల్ పాత్రలే కనిపిస్తున్నాయి. అదే విధంగా… నియోజకవర్గంలోని వందలాది హోటళ్లలో కూడా ప్లాస్టిక్ గ్లాసుల స్థానంలో స్టీల్ గ్లాసుల వినియోగం పెరిగి… ప్లాస్టిక్ వ్యర్థాలను గణనీయంగా తగ్గించడంలో ఈ కార్యక్రమం విశేష ఫలితాలను సాధిస్తోంది.

మహిళా సంఘాలు ఈ స్టీల్ బ్యాంకులను సమర్థవంతంగా నిర్వహిస్తూ… పర్యావరణ పరిరక్షణలో ముందుంటున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గాయి… గ్రామాలు మరింత పరిశుభ్రంగా మారాయి… ప్రజల్లో బాధ్యత పెరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కి అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదు… సమాజంలో శాశ్వత మార్పును తీసుకువచ్చే ఆలోచనలే నిజమైన అభివృద్ధి. ప్రజాపాలనలో సంక్షేమాన్ని… సేవలో బాధ్య తను… పర్యావరణ పరిరక్షణలో సామాజిక భాగస్వా మ్యాన్ని విశ్వసిస్తూ… ప్రతి కార్యక్రమం ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు.
స్టీల్ బ్యాంక్… అందుకు నిలువెత్తు ఉదాహరణ :
అంతేకాదు… ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ లక్ష్యాన్ని గ్రామాలకే పరిమితం చేయకుండా… ప్రజలు నిత్యం వినియోగించే హోటళ్లలో కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలోని మొత్తం 319 హోటళ్లకు 33,900 స్టీల్ గ్లాసులను పూర్తిగా ఉచితంగా అందించి… ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులకు శాశ్వత ప్రత్యామ్నా యాన్ని అందించారు. ఇది కేవలం పాత్రల పంపిణీ కాదు… ఇది గ్రామాల్లోనే కాదు… వాణిజ్య సంస్థల్లోనూ పర్యావరణ చైతన్యాన్ని నాటిన ఒక సామాజిక విప్లవం. స్టీల్ బ్యాంక్ కార్యక్రమంతో ప్లాస్టిక్ నిర్మూలనకు వేగం పెంచుతూ… హుస్నా బాద్ నియోజకవర్గాన్ని పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం కొనసాగుతోంది.
చెరువులు, గ్రామ వీధులు, ప్రజా ప్రదేశాలను ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి విముక్తం చేస్తూ… తాగునీటి వనరులను పరిశుభ్రంగా కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.. ప్రజల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ… పరిశుభ్రమైన జీవన విధానానికి బాటలు వేస్తున్నారు.. వేస్తున్నాం. ప్లాస్టిక్ నిర్మూలనతో పాటు పచ్చదనానికి పెద్దపీట వేస్తూ… విస్తృతంగా మొక్కలు నాటడం, సుందరీకరణ పనులు చేపట్టడం ద్వారా నియోజకవర్గానికి కొత్త అందాన్ని తీసుకొస్తున్నారు.. వ్యవసాయ భూములు ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి రక్షణ పొందుతుండగా… ఇంటి పరిసరాల్లో పండించే కూరగాయలు కూడా స్వచ్ఛమైన వాతావరణంలో సాగయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.
ప్లాస్టిక్ వినియోగం తగ్గిన తర్వాత హుస్నాబాద్‌లోని పలు ప్రాంతాలు మరింత పరిశుభ్రంగా, పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. యెల్లమ్మ చెరువు, పల్లె చెరువు, కొత్త చెరువు పరిసరాలు శుభ్రతతో ఆకర్షణీయంగా మారగా… త్రిశూలం జంక్షన్, గాంధీ విగ్రహం పరిసరాల సుందరీకరణ, చెరువు వద్ద ఏర్పాటు చేసిన ‘ ఐ లవ్ హుస్నాబాద్ ‘ ప్రదేశం, హుస్నాబాద్ పట్టణ డివైడర్ల మధ్య యోగా లోగోలు, ఎల్కతుర్తి చౌరస్తా వంటి ప్రాంతాలు పచ్చదనం, పరిశుభ్రతకు ప్రతీకలుగా రూపుదిద్దుకున్నాయి.
ప్లాస్టిక్ రహిత గ్రామాలు… పరిశుభ్రమైన చెరువులు… స్వచ్ఛమైన పరిసరాలు… పచ్చని హుస్నాబాద్… ఈ ఉమ్మడి సంకల్పంతో ప్రజల సహకారాన్ని మరింత పెంచుకుంటూ… భావితరాలకు ఆరోగ్యకరమైన, అందమైన, పర్యావరణ హిత మైన నియోజకవర్గాన్ని అందించే దిశగా ఈ మహత్తర ప్రయా ణం కొనసాగుతోంది. ఒక సంవత్సరం క్రితం నాటిన చిన్న విత్తనం… నేడు హుస్నాబాద్ వ్యాప్తంగా పర్యావరణ చైతన్య వృక్షంగా ఎదుగుతోంది.
“ఈ ప్రయాణం ఇక్కడితో ముగిసేది కాదు… ప్లాస్టిక్ రహిత గ్రామాల నుంచి… ప్లాస్టిక్ రహిత హోట ళ్ల వరకు… అక్కడి నుంచి ప్లాస్టిక్ రహిత తెలంగాణ వైపు కొన సాగే ప్రజా ఉద్యమం ఇది.” ఒక సంవత్సరం… 276 గ్రామ సంఘాలు.. 7,376 స్వయం సహాయక సంఘాలు.. 80,633 మంది సంఘ సభ్యులకు ప్రయోజనం.. 276 స్టీల్ బ్యాంక్ సెట్లు.. 300 సెట్, 400 సెట్, 500 సెట్ ఇవ్వడం జరిగింది, ప్రతి సెట్లో 13 రకాల స్టీల్ పాత్రలు.. 319 హోటళ్లకు 33,900 స్టీల్ గ్లాసుల పంపిణీ.. రూ.2.54 కోట్లకు పైగా సేవా సంకల్పం.. ఒకే లక్ష్యం – ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్.(Youtube)
