Homeరంగారెడ్డిComplaint | పానాది కబ్జాపై ప్రజావాణిలో ఫిర్యాదు

Complaint | పానాది కబ్జాపై ప్రజావాణిలో ఫిర్యాదు

కీసర గ్రామంలోని పాత బొడ్రాయికి వెళ్లే పానాదిని కొందరు కబ్జా చేసి గోడ నిర్మించారని ఆరోపిస్తూ మాజీ ఉప సర్పంచ్ తటాకం లక్ష్మణ్ శర్మ సోమవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పానాదిని ఆక్రమించి గోడ నిర్మించడంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పానాది స్థలాన్ని పరిశీలించి, ఆక్రమణలను తొలగించి ప్రజా వినియోగానికి రక్షించాలని అధికారులను కోరారు. అధికారులు స్పందించి సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News