రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ అరెస్టు చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో, గత కొన్ని రోజులుగా చేపడుతున్న నిరాహార దీక్షకు(Hunger Strike) మద్దతు తెలిపేందుకు మంగళవారం తాడ్వాయి మండలం నుండి భారీ సంఖ్యలో అంబేద్కర్ సంఘం సభ్యులు(Ambedkar Association), దళిత సంఘల సభ్యులు భారీ సంఖ్యలో తరలి వెళ్లి దీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు చేసిన హమారా ప్రసాదుపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు గణేష్, సెక్రటరీ రాజలింగం, కోశాధికారి సంతోష్, సభ్యులు గడ్డం రవి, రాజు, మెట్టు రవీందర్ కౌడి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
