- కాప్రా తహసీల్దార్ మతిన్
జవహర్ నగర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని వికలాంగుల కాలనీ, బాలాజీ నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే సమాచారం అందడంతో రెవెన్యూ అధికారులు వెంటనే రంగంలోకి దిగి కూల్చివేత చర్యలు చేపట్టారు. కాప్రా తహసీల్దార్ మతిన్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ జేసీబీ సహాయంతో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను తొలగించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ మతిన్ మాట్లాడుతూ, ప్రభుత్వ అనుమతులు లేకుండా చేపట్టే ఎలాంటి నిర్మాణాలనైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జవహర్ నగర్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ప్రజలు తప్పనిసరిగా సంబంధిత శాఖల అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని అధికారులు సూచించారు. ఈ కూల్చివేత కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు.
