- తాడ్వాయి ఏవో నర్సిములు.
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వాళ్ల వర్షాల కారణంగా మండలంలోని మొక్క జొన్న,సోయాబీన్,పత్తి, పంటలలో నీరు నిల్వ ఉంటే పంటలు ఎదుగుదల తగ్గుతుందని తద్వారా పంట నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు వారి పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తాడ్వాయి ఏవో నర్సింలు అన్నారు.ఆయన శనివారం తాడ్వాయి మండలంలోని ఎర్రపాహడ్ గ్రామంలో మొక్క జొన్న సోయాబీన్ పత్తి పంటలను పరిశీలించారు. కొందరి రైతుల పొలాల్లో నీరు నిల్వ ఉండటం మేము గమనించమని వాటిని వెంటనే బయటకు తరలించాలని రైతులకు సూచనలు ఇచ్చినట్టుగా ఆయన తెలిపారు.

అలాగే మొక్కల ఎదుగుదలకు 19: 19: 19 మన ఎరువును పోషక మిశ్రమంతో తగిన మోతాదులో పిచికారి చేయాలని ఆయన రైతులకు సూచించారు మొక్కజొన్న పొలాలు కత్తెర పురుగు నివారణకు క్లోరిన్ ట్రానిలిప్రోల్ [email protected] మి. లీ. లీటరు నీరు ఎమామెక్టీన్ బెజోయేట్ [email protected] గ్రా./ పీటర్ నీటిని కలిపి పిచికారి చేయాలన్నారు. రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అందుబాటులో ఉంటారని వారి సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏయూ శివ చైతన్య ఎర్రపహడ్ గ్రామ రైతులు పాల్గొన్నారు

