- మన బోగత వద్ద…మంత్రి సీతక్క!
- పది నిమిషాలు మనసు పరవశించి న జలపాత సాన్నిధ్యం!!
ములుగు జిల్లా నేల ముద్దుబిడ్డగా వెలసిన “నయా నయాగార” మన “బోగత జలపాతం”,
“ప్రకృతి” ఒడిలో రాసిన అపూర్వ కావ్యానికి సజీవ రూపం ఇక్కడి అటవీ “బోగత”
“తెలంగాణ నయాగారాగా” ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఆ సుడుల అలజడి జలధార,
చూసిన ప్రతి హృదయాన్ని ఆనందంతో నింపే అటవీప్రాంతంలో ని “అపురూప అందాల హారం”.
కొండల ఒడిలోంచి ఉప్పొంగే జలధారల గానం,
పచ్చని అడవుల నడుమ పరవశింపజేసే ప్రకృతి ధ్యానం.
ప్రతి నీటి చుక్కలో ములుగు నేల గొప్పదనం మెరిసిపోతుంటే,
ప్రతి అలలో తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిధ్వనిస్తోంది.

అలాంటి ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ,
బోగతా అందాలను శనివారం సాయంత్రం సందర్శించిన మంత్రి సీతక్క! ఒకింత మైమరచి పరవళ్లు తొక్కారు.ఆనాటి సీతక్క అడుగులు,
ప్రకృతిని ప్రేమించే నేటి నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం.
అభివృద్ధితో పాటు ప్రకృతి సంరక్షణే నిజమైన ప్రగతి అని
తన సందర్శనతో మరోసారి చాటి చెప్పారు.
బోగతా జలపాతం కేవలం పర్యాటక కేంద్రమే కాదు,
ములుగు గర్వం… తెలంగాణ ప్రకృతి కిరీటంలోని అమూల్య రత్నం.
దాన్ని చూసిన ప్రతి మనసు మళ్లీ మళ్లీ రావాలనుకునేలా చేసే
అద్భుతమైన ప్రకృతి కానుక.
జలపాతం జలధారలా ప్రజలపై ప్రేమను కురిపిస్తూ,
అడవి పరిమళంలా ఆప్యాయతను పంచుతూ,
ములుగు అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపిస్తున్న
మంత్రి సీతక్క సేవలు చిరస్మరణీయాలు.
బోగతా జలపాతం చిరకాలం ప్రవహించాలి…
ములుగు వైభవం ప్రపంచమంతా విరాజిల్లాలి…
ప్రకృతిని ప్రేమించే ప్రతి అడుగు
తెలంగాణ భవిష్యత్తుకు వెలుగునివ్వాలి…
