జవహర్‌నగర్: కీసర సర్కిల్ జవహర్‌నగర్ చంద్రపురి కాలనీ డివిజన్. 1 పరిధిలోని వికలాంగుల కాలనీలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించి(Support) మానవత్వాన్ని చాటుకున్నారు. కాలనీకి చెందిన సుమలత భర్త రాజు దివ్యాంగుడిగా అనారోగ్యంతో మృతి చెంది ఏడాది కావస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉండటంతో కుటుంబ పోషణ భారంగా మారింది. గత రెండు నెలలుగా కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉందని సుమలత తన ఆవేదనను వికలాంగుల నాయకుల దృష్టికి తీసుకెళ్లింది.
విషయం తెలుసుకున్న వికలాంగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ వెంటనే స్పందించి జవహర్‌నగర్ మణికంఠ పూసల సంఘం అధ్యక్షుడు మధ్యబోయిన రాజును సంప్రదించారు. దీంతో మధ్యబోయిన రాజు తన వంతు సహాయంగా బియ్యంతో పాటు వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను సమకూర్చారు. మంగళవారం వికలాంగుల కాలనీలోని సుమలత కుటుంబాన్ని పరామర్శించి సరుకులను అందజేశారు.
ఈ సందర్భంగా మెరుగు శివకృష్ణ మాట్లాడుతూ సుమలత కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్న వెంటనే స్పందించి సహాయం అందించిన మధ్యబోయిన రాజుకు, ఆయన కుటుంబ సభ్యులకు వికలాంగుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయాన్ని అందించాలని కోరారు.
కార్యక్రమంలో పత్రికా విలేకరులు చింతల విజయ్ కుమార్, రఘు, వికలాంగుల నాయకుడు నాగరాజు, మహిళా నాయకురాలు సుగుణక్క తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
