- బిజెపి అధ్యక్షులు సాయిప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం..
- కేక్ కట్ చేసి కేంద్రమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు..
కేంద్ర మంత్రివర్యులు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని వారాసిగూడ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బౌద్ధ నగర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు సాయిప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులకు, కార్యకర్తలకు, వాహనదారులకు పలహారం పంచిపెట్టడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరూ కిషన్ రెడ్డి ఆయురారోగ్యాలతో, మరెన్నో ఏళ్లు ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు.




సాయిప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ కిషన్ రెడ్డి గత 3 దశాబ్దాలుగా సికింద్రాబాద్ ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అందరికీ తెలిసిందెనని. మెట్రో, ఫ్లైఓవర్లు, రైల్వే అభివృద్ధి పనులతో సికింద్రాబాద్ రూపురేఖలు మార్చారని . మా ప్రాంతానికి ఆయన గర్వకారణం” అని కొనియాడారు. కార్యక్రమంలో.. మాజీ కార్పొరేటర్ స్వరూపగౌడ్ కృష్ణమూర్తి రవి ప్రసాద్ గౌడ్ నాగేష్ రెడ్డి హరి శారదా మల్లేష్ ఆకారం రమేష్ అజయ్ నాయుడు అంబాల రాజేశ్వరరావు దేశభైనా రఘు సంపత్ నాగరాజు ఓములు బిక్షపతి భాస్కర్ గౌడ్ హాజీ పాషా నవీన్ వెంకటేష్ అగుల్ల శీను సుధాకర్ రాజు సారధి సాగర్ రూప్ సాయి రోహిత్ నాని బబ్లు ప్రమోద్ గజరాజు పాల్ వినయ్ మురళి తదితరులు పాల్గొన్నారు.
