Monday, June 15, 2026
Homeకెరీర్ న్యూస్NEET | నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదల..

NEET | నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదల..

  • వ్యక్తిగత వివరాలు చెక్ చేసుకోవాలని సూచన..

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్‌ను నమోదు చేసి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎన్‌టీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21, 2026న నిర్వహించనున్నారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డులో ఉన్న వ్యక్తిగత వివరాలు, పరీక్షా కేంద్రం, రోల్ నంబర్, పరీక్ష సమయం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్‌లో పేరు, ఫోటో, రోల్ నంబర్,పరీక్షా కేంద్రానికి సంబంధించిన వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే ఎన్‌టీఏ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు. అలాగే [email protected] కు ఈమెయిల్ ద్వారా కూడా సమస్యలను తెలియజేయవచ్చు.

- Advertisement -

అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే ముందు, ఫీజు రీఫండ్‌కు సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో అభ్యర్థులు ధృవీకరించుకోవాలని ఎన్‌టీఏ సూచించింది. అవసరమైతే వెంటనే సవరణలు చేసుకోవాలని పేర్కొంది. పరీక్షా రోజు అభ్యర్థులు అడ్మిట్ కార్డు ప్రింట్‌ను తప్పనిసరిగా తమతో తీసుకెళ్లాలి.

అలాగే చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలి. పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకోవాలి. అడ్మిట్ కార్డులో, ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో పేర్కొన్న అన్ని సూచనలను కచ్చితంగా పాటించాలి. నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రానికి తీసుకురాకూడదు. అభ్యర్థులు పరీక్షకు ముందు అధికారిక సూచనలను పూర్తిగా చదివి, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని ఎన్‌టీఏ స్పష్టం చేసింది

- Advertisement -
RELATED ARTICLES

Latest News